మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న డింపుల్ హయతికి సూపర్ ఛాన్సులు వస్తున్నాయి. గల్ఫ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు ఆ తర్వాత అభినేత్రి 2 సినిమాలో నటించింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెప్పించింది డింపుల్ హయతి. ఆ సినిమా టైం లో డైరక్టర్ హరీష్ శంకర్అమ్మాయి స్టార్ హీరోయిన్ అవుతుందని చెప్పాడు. రవితేజ సినిమా పూర్తి కాకుండానే అమ్మడికి సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

ఖిలాడితో పాటుగా మరో రెండు తెలుగు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉండగా లేటెస్ట్ గా డింపుల్ హయతికి ఓ బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. శంకర్ డైరక్షన్ లో అనియన్ అదే అపరిచితుడు సినిమా హిందీ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో డింపుల్ హయతికి మంచి అవకాశం దక్కిందట. సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో ఆమె నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సినిమాలో హీరోయిన్ గా ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు కాని డింపుల్ హయతి మాత్రం కన్ ఫర్మ్ అని అంటున్నారు.

తనకు వచ్చిన ప్రతి ఛాన్స్ కాదనకుండా చేస్తున్న డింపుల్ హయతి ఖిలాడి సినిమాలో తన నటనతో అందరిని మెప్పిస్తుందని అంటున్నారు. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఆమె బిజీ హీరోయిన్ అవుతుందని చెబుతున్నారు. కొంతమందికి టాలెంట్ ఉన్నా సరే అవకాశాలు లేట్ గా వస్తాయి. ఈ క్రమంలో డింపుల్ హయతికి కూడా తెలుగుతో పాటుగా హిందీ ఛాన్సులు కూడా వస్తున్నాయని చెప్పొచ్చు. డింపుల్ హయతి తెలుగులో కూడా పాగా వేయాలని చూస్తుంది. అందుకే స్పెషల్ సాంగ్స్, స్పెషల్ రోల్స్ వచ్చినా సరే కానకుండా చేసేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: