సినిమా ఇండస్ట్రీలో మళ్లీ సాధారణ రోజులు వస్తున్నాయి. షూటింగులు మళ్లీ స్టార్ కావడమే కాదు.. సినిమా రిలీజ్ లకు సిద్ధమవుతున్నాయి. థియేటర్లు తెరుచుకోవడం ఆలస్యం తమ సినిమాలను విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ఆలోచిస్తున్నారు. దీంతో సినీ లవర్స్ కు ఎక్కడ లేని ఉత్సాహం వస్తోంది.

ఎండాకాలంలో ప్రేక్షకులను సిినిమాలతో ఎంజాయ్ చేపించాలని సినిమా ఇండస్ట్రీ భావించింది. వరుస సినిమాలతో ఆడియన్స్ కు బాగా దగ్గరవ్వాలని ప్లాన్ వేసింది. కానీ వారి ఆలోచనలపై కరోనా దెబ్బకొట్టింది. ఇపుడు పరిస్థితులు చక్కబడుతుండటంతో సినీ అభిమానులను సినీ లోకంలో విహరింపజేసేందుకు ప్లాన్ వేస్తోంది.

విక్టరీ వెంకటేశ్ గతేడాది  ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం మూడు సినిమాలు  విడుదలయ్యేలా ప్లాన్ వేసుకున్నాడు. 'నారప్ప', 'దృశ్యం2' తీసుకురావాలనుకున్నాడు. అందుకే 'దృశ్యం2' షూటింగ్‌ని చాలా స్పీడ్ గా పూర్తి చేశాడు.  ఇక వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా రూపొందుతోన్న 'ఎఫ్-3' సినిమా షూటింగ్‌ మళ్లీ మొదలైంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గడంతో, అందరూ సెట్స్‌లోకి వచ్చేశారు. ఇక ఈ పోర్షన్‌ని వీలైనంత త్వరగా పూర్తి చేసి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కి వెళ్లాలనుకుంటోంది యూనిట్. ఇక 'నారప్ప, దృశ్యం2, ఎఫ్-3'లో రెండు సినిమాలు ఓటీటీకి వెళ్తాయనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఇక నేచురల్ స్టార్ నాని అయితే సంవత్సరానికి మూడు సినిమాలతో రావాలనుకున్నాడుయ కానీ 2020లో కరోనా దెబ్బకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఒక్క వి మాత్రమే ప్రేక్షకులను పలుకరించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో రాకపోయినా.. ఓటీటీలో మాత్రం వచ్చింది. ఇక ఈ ఏడాదిలో హవా సృష్టిద్ధామనుకున్నా కరోనా ఆయన ఆలోచనలకు బ్రేక్ లు వేస్తోంది. చాలా భాగం షూటింగ్‌ పూర్తి చేసుకున్న 'శ్యామ్ సింగరాయ్', 'అంటే.. సుందరానికి' సినిమాలని ఫాస్ట్‌గా పూర్తి చెయ్యాలనుకుంటున్నాడు నాని. ఇక  ఏప్రిల్‌ 30న 'విరాటపర్వం'తో రావాలనుకున్నాడు. కానీ కరోనాతో 'విరాటపర్వం' వాయిదా పడింది. అలాగే పవన్‌ కళ్యాణ్‌తో కలిసి చేస్తోన్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌ షూటింగ్‌కి అడ్డంకులు ఎదురయ్యాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: