బాలీవుడ్‌ లో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటారు. బిజినెస్ కూడా అలాగే జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద సినిమాలకు అది ఒక నిలయం. అంతటి ఘనత ఉన్న బాలీవుడ్ లో ఎప్పుడూ కాంట్రవర్శీలతో గడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా టైటిల్ విషయంలో చాలా గొడవలే జరుగుతాయి.

సంజయ్ లీలా భన్సాలి సినిమాల విషయంలోనూ ఇలాంటి గొడవలే జరిగాయి.  'పద్మావతి' సినిమా టైటిల్‌ రాజ్‌పుత్‌లని అవమానించేలా ఉందని, పేరు మార్చకపోతే హతమారుస్తామని కర్ణిసేన గట్టి వార్నింగ్ ఇచ్చింది.  దీపిక పదుకొణే ముక్కు, చెవులు కోస్తామని హెచ్చరించింది.  దీంతో 'పద్మావతి' టైటిల్‌ని 'పద్మావత్‌'గా మార్చక తప్పలేదు భన్సాలి. రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకొణేకి సూపర్ హిట్ జోడీ ఇమేజ్‌ని తీసుకొచ్చిన సినిమా ' గోలియోంకి రాస్‌లీలా రామ్‌లీలా'. ఈ మూవీ టైటిల్‌ విషయంలోనూ గొడవలు జరిగాయి. మొదట ఈ సినిమాకి 'రామ్‌లీలా' అనే పేరు పెట్టాడు భన్సాలి. అయితే కొన్ని హిందూ సంస్థలు, మనోభావాలు దెబ్బతీంటున్నాయని ఆందోళన చేశారు. దీంతో రామ్‌లీలాని కాస్తా 'గోలియోంకి రాస్‌లీలా..రామ్‌లీలా' అని మార్చాడు సంజయ్ లీలా భన్సాలి.

ఇక రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో జాన్‌ అబ్రహం చేసిన సినిమా 'మద్రాస్ కేఫ్'. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విషయంలోనూ టైటిల్ గొడవలు చెలరేగాయి. మొదట ఈ సినిమాకి 'జఫ్‌నా' అనే టైటిల్ పెట్టారు. అయితే కొన్ని రాజకీయ పార్టీల ఆందోళనలు, పొరుగుదేశం శ్రీలంకతో సంబంధాల దృష్ట్యా 'జఫ్‌నా'ని 'మద్రాస్‌ కేఫ్'గా మార్చేశారు.  

ఇక ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ సాజిద్‌ నదియద్‌వాలా నిర్మాణంలో సమీర్‌ విద్వాన్స్‌ దర్శకత్వంలో 'సత్యనారాయణ్‌కి కథ' సినిమా చేస్తున్నాడు. అయితే ఈ మూవీ టైటిల్‌ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచే  వివాదాలు కూడా మొదలయ్యాయి. సంస్కృతి బచావో మంచ్ నదియద్‌వాలాపై పోలీస్ కేసు పెట్టింది. మెజార్టీ ప్రజల విశ్వాసాన్ని కించపరిచేలా ఉన్న ఈ టైటిల్‌ని తొలగించాలని ఆందోళనలు చేసింది. దీంతో ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని, టైటిల్ మారుస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: