కొంతమందికి తొలి సినిమాతోనే ఎనలేని పేరు వస్తుంది. దాంతో వారు ఆ
సినిమా పేరు తోనే పిలువబడుతూ దాన్ని ఇంటి పేరుగా మార్చుకొని తమ కెరీర్ ను కొనసాగిస్తూ ఉంటారు. అది వారికి ఎంతో ఆనందాన్నిస్తుంది కూడా. వారు నటించిన తొలి సినిమాకు ఎంతో పేరు వచ్చింది కాబట్టి తమను ఆ పేరు తో పిలుస్తుంటారు అన్న
భావన వారిలో నెలకొంటుంది. సినిమాల్లో రాణించాలని కోరిక ఉండేవారికి ఇది ఎంతో ఆనందించదగ్గ విషయం. ఆ విధంగా
ఆహుతి సినిమాలో చేసిన పాత్రతో
ప్రసాద్ ఆహుతి ప్రసాద్ గా మారి ప్రేక్షకులను ఎన్నో సినిమాల్లో మెప్పిస్తూ వచ్చాడు.
ఆహుతి
ప్రసాద్ పూర్తిపేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హాస్యనటుడుగా 300 పైగా సినిమాల్లో నటించిన ఆయన మొదట్లో సీరియల్స్ లో నటించి ఆ తరువాత
ఆహుతి సినిమా ద్వారా సినిమాల్లోకి ప్రవేశించి తొలి
సినిమా తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా
ఆహుతి ప్రసాద్ గా ఆయన అవతారం ఎత్తిన తర్వాత వెను తిరిగి చూసుకోలేదు వరుస సినిమాల్లో అవకాశాలు ఆయనకు వచ్చాయి.
ఆహుతి సినిమాలో శంభుపసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. పోలీసు పాత్రలకు, రాజకీయనాయకుల పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఆయన సినిమాలు చేశారు.
1990లో
పోలీస్ భార్య సినిమాను కన్నడలో నిర్మాతగా మారి అనువాదం చేసి హిట్ కొట్టగా మరో మూడు సినిమాలు కూడా తెరకెక్కించి నిర్మాతగా కూడా ఆయన విజయవంతం అయ్యారు. మధ్యలో ఓ నాలుగు సంవత్సరాలు తెలుగులో అవకాశాలు
రాజా ఎంతో ఇబ్బంది పడ్డారు. నిన్నే పెళ్ళాడుతా
సినిమా మళ్లీ ఆయనకు తిరిగి అవకాశాలు తెచ్చి పెట్టడంలో చాలా సహాయ పడింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సినిమాలో నటనకుగాను 2002 సంవత్సరానికి ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు పురస్కారం అందుకున్నారు.
చందమామ సినిమాలో పోషించిన హాస్యభరితమైన విభిన్నమైన పాత్రకు ఆయనకు మంచి పేరు వచ్చింది. అంతేకాదు
గుమ్మడి విభాగంలో నంది అవార్డు పొందారు. 2015
జనవరి 4న ఆయన అనంతలోకాలకు పయనమయ్యారు.