కాగా ఈమె ప్రస్తుతం హిందీ పరిశ్రమలోనే మూవీలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. గత రెండేళ్లుగా ఈ బ్యూటీ ముంబైలోనే ఉంటూ హిందీ భాషలోనే టాప్ పొజిషన్ కు చేరుకునేందుకు చాలా కసరత్తులు చేస్తోంది. ఇప్పటికైతే కియరా బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలోనే దూసుకుపోతుంది. కాగా సేమ్ సమయంలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో లవ్ లో కూరుకుపోయిందని అప్పట్లో బాలీవుడ్ మీడియా చెప్పింది. ఇక ఇదేక్రమంలో వారి ప్రేమకు తగ్గ ఆధారలు కూడా బయటకు వచ్చాయని సమాచారం.
వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, విదేశీ టూర్ల కు సంబంధించిన వీడియోలు క్లారిటీ దొరికిందని తెలుస్తోంది. కాగా రీసెంట్ గా కియారా చేసిన ఓ పనికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయని సమాచారం. కియరా అద్వానీ హడావుడిగా ఎక్కడికో తన కారులో వెళుతోంది ఈ బ్యూటీ. ఇక అంతలోనే ఓ పెద్దాయనతో కియారా అద్వానీ కారు డోర్ తీయించడం సంచలనంగా మారింది. అదే సమయంలో కనీసం ఆయనకు థాంక్స్ కూడా చెప్పకుండా దర్పం ఒలకబోయడం తన సంస్కారాన్ని నిరూపించుకుంది.
ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు తనపై తీవ్రంగా మండిపడుతున్నారని తెలుస్తోంది. తన ఖరీదైన కారులో సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటికి వచ్చిన బ్యూటీ కియారా తన కారు డోర్‌ను వయసు పైబడిన వ్యక్తితో తీయించగా.. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి