ఎందుకంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర తన దగ్గరికి వచ్చింది అంటే తప్పకుండా చేయడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటాడు విజయ్ సేతుపతి. ఇక తన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. అయితే ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్ లకే క్రేజ్ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్స్ సైతం వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే అటు విజయ్ సేతుపతి కూడా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు. ఇక ఇటీవల విజయ్ సేతుపతి కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.
సమంత ప్రధాన పాత్రలో మనోజ్ బాజ్పాయ్ కీలక పాత్రలో తెరకెక్కిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ అన్ని భాషలలో ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇక ఇప్పుడు దీనికి సంబంధించి మూడవ సిరీస్ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 3 విజయ్ సేతుపతి నటించబోతున్నాడని గతకొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు. ఈ సిరీస్ కోసం తనను ఎవరూ ఇప్పటివరకూ సంప్రదించలేదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం షాహిద్ కపూర్తో రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో మాత్రమే నటిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. మనోజ్ బాజ్పాయ్ తో నటించడం తనకు ఎంతో ఇష్టం అయినప్పటికీ ఇక వెబ్ సిరీస్ లో నటించాలని ఎవరూ సంప్రదించలేదు అంటూ క్లారిటీ ఇచ్చేశాడు విజయ్ సేతుపతి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి