నాచురల్ స్టార్ నాని శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన టక్ జగదీష్ రిలీజ్ కు రెడీ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ వల్ల వయిదా పడుతూ వచ్చిన టక్ జగదీష్ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో అప్పుడు రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలుస్తుంది. ఈ క్రమంలో టక్ జగదీష్ మ్యాక్సిమం ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా తర్వాత నాని చేస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్.. రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో భారీ అంచనాలతో ఈ సినిమా వస్తుంది.

నాని కెరియర్ లో ఇప్పటివరకు ఏ సినిమాకు పెట్టని హయ్యెస్ట్ బడ్జెట్ తో శ్యామ్ సింగ రాయ్ వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి ఇద్దరు నటిస్తున్నారని తెలిసిందే. ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ నటించడం తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా తర్వాత నాని టాలెంటెడ్ డైరక్టర్ వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అంటే సుందరానికీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. ఇక కమిటైన ఈ సినిమాలన్ని పూర్తయ్యాక మరోసారి జెర్సీ కాంబినేషన్ లో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు నాని. అయితే అది జెర్సీ సినిమాకు సీక్వల్ గా ఉంటుందా అని ఆడియెన్స్ లో డిస్కషన్స్ మొదలయ్యాయి.

గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన జెర్సీ సినిమా నాని కెరియర్ లో ప్రత్యేకంగా నిలిచిందని చెప్పొచ్చు. సినిమాకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది అంటే సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే మరోసారి జెర్సీ కాంబో రిపీట్ చేయబోతున్నారని తెలుస్తుంది. హిందీ జెర్సీ రీమేక్ పనులు దాదాపు పూర్తి చేసుకున్న గౌతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ నానితో చేయాలని చూస్తున్నాడట. ఆల్రెడీ నానికి గౌతం ఒక కథ కూడా వినిపించాడని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: