తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఛార్మి తెలుగుతో పాటుగా హిందీ తమిళ్ కన్నడ ఇలా పలు భాషల్లో 40 సినిమాలకి పైగా నటించి మెప్పించింది. యూత్ లో ఈమెకు పిచ్చ క్రేజ్ ఉంది. అయితే ఊహించని పరిణామాల వలన ఈ ముద్దుగుమ్మ కెమెరాకు దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలసి నిర్మాణ రంగం వైపు అడుగులు వేసింది. విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ నిర్మాతగా మరో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. అయితే ఏది ఏమైనా నటనలో వచ్చే కిక్కే వేరు. ఇప్పుడు ఇదే కిక్ కోసం మరోసారి మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతోందట ఛార్మి.

నిర్మాతగా బాగానే సెటిల్ అయినప్పటికీ వెండితెరపై కనిపించాలని ఆశ పడుతున్నారట. ఓ స్టార్ హీరో చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం చార్మిని సంప్రదించగా అందుకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వయసు మూడు పదులు దాటుతున్నా వన్నె తగ్గని అందం ఛార్మి సొంతం. ఇప్పటికీ యూత్ లో ఈమెకు అంతే ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు స్పెషల్ సాంగ్ తో ఛార్మి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వనుంది అంటూ వార్తలు వినబడుతున్నాయి. మరో వైపు అలాంటిదేమీ లేదు నిర్మాతగా ఛార్మి చాలా బిజీగా ఉందని, ఈమె ఇప్పుడు ఎలాంటి సాంగ్ చేయడానికి సైన్ చేయలేదని, అసలు వాస్తవానికి ఆ ప్రస్తావనే లేదని చార్మి సన్నిహితులు అంటున్నారు.

మరి ఏది నిజమో తెలియదు. కానీ, తమ అందాల తార ఛార్మిని మరో సారి వెండి తెరపై చూడబోతున్నామనే వార్త మాత్రం అభిమానులను తెగ ఊరిస్తోంది.  ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లైగర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఛార్మి. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: