తెలుగులో యంగ్ హీరో శ్రీ విష్ణు సరసన 'మెంటల్ మదిలో' సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన నివేదా పేతురాజ్.. ఆ తర్వాత 'చిత్ర లహరి', బ్రోచేవారేవారురా వంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.ఇక ఇటీవల అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠ పురములో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి భారీ హిట్ అందుకుంది.ఇక తాజాగా రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమాలో కూడా ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెరిసింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న 'విరాట పర్వం' సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.

అయితే హీరోయిన్ గా  మంచి సినిమాలు చేతున్న నివేదా..తాజాగా మెగా ఫోన్ పట్టాలని అనుకుంటోందట.తనకు డైరెక్టన్ అంటే చాలా ఇష్టమని అంటోంది ఈ బన్నీ హీరోయిన్.స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత డైరెక్షన్ వైపు తన అడుగులు వేయాలని అనుకుంటుందట నివేదా పేతురాజ్.కొంతకాలం వరకు సినిమాలు చేశాక..ఆ తర్వాత స్వయంగా ఓ మంచి కథను సిద్ధం చేసుకుని డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నట్లు తన సన్నిహితుల దగ్గర చెబుతోందట ఈ హీరోయిన్.అయితే సినీ ఇండస్ట్రీలో ముందు హీరోయిన్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి.. ఆ తర్వాత మెగాఫోన్ పట్టి సక్సెస్ సాధించినవారు చాలామందే ఉన్నారు.

ఇప్పుడు నివేదా కూడా అదే దారిలోకి వెళ్ళడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.ఇక ప్రస్తుతం నివేదా పేతురాజ్..మరి హీరోయిన్ గా ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకున్న నివేదా.. డైరెక్టర్ గా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి. ఇక తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది.వెంకట్ ప్రభు తెరకెక్కిస్తోన్న భారీ మల్టీస్టారర్ మూవీ 'పార్టీ' తో పాటూ ఏ. ఎల్. విజయ్ ఫీమేల్ సెంట్రిక్ మూవీ 'అక్టోబర్ 31 లేడీస్ నైట్' అనే చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. ఇక తెలుగు లో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న 'పాగల్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: