
ఈరోజు ఉపాసన పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి మరికొన్ని విషయాలను మనం తెలుసుకుందాం.. ఉపాసన 1989 జూలై 20 వ తేదీన జన్మించారు. తల్లి శోభన అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్. తండ్రి అనిల్ కామినేని "K I " గ్రూప్ వ్యవస్థాపకులు. ఇక ఈమెకు ఒక సోదరుడు, చెల్లెలు కూడా ఉన్నారు. ఇక వీరి తాత ప్రతాపరెడ్డి తొలి కార్పొరేట్ సంస్థ అపోలో హాస్పిటల్ ను స్థాపించారు. లండన్ లోని యూనివర్సిటీలో బిజినెస్ మార్కెటింగ్, మేనేజ్మెంట్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఇక ఉపాసన అపోలో హాస్పిటల్స్ లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తోంది. ఈమె ఎక్కువగా సామాజిక మాధ్యమాలలో పాల్గొంటూ, ప్రజలలో ఆరోగ్యపరంగా కావలసిన అన్ని అవగాహనలను కల్పిస్తూ ఉంటుంది.
ఇటీవల కరోనా సమయంలో సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది రోగులకు ధైర్యాన్ని నింపి, వారికి కావలసిన అన్ని ఆరోగ్య సూచనలను అందించింది. అంతేకాదు వారి హాస్పిటల్ లో తక్కువ ఖర్చుతో చికిత్స కూడా చేయించింది. ఇక ఈమె ఆరోగ్య సంస్థలలో చేసిన సేవలను గాను 2019లో మహాత్మాగాంధీ అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అలాగే 2017 లో ఫెమినా రికగ్నేషన్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇక జూన్- 14 - 2012 సంవత్సరం లో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ను వివాహం చేసుకుంది.
ఇక అంతే కాకుండా ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ తనకంటే వయస్సులో రెండు సంవత్సరాల చిన్నవాడైన అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కూడా తన కంటే ఒకటిన్నర సంవత్సరం చిన్నవాడైన ధనుష్ ను వివాహమాడింది.