టాలీవుడ్ లో రీమేక్ స్పెషలిస్ట్ అంటే అందరు చెప్పే పేరు ఒక్కటే ఆయనే విక్టరీ వెంకటేష్. ఇప్పుడు కాదు ఆయన కెరియర్ స్టార్టింగ్ నుండి రీమేక్ సినిమాలతో సూపర్ హిట్లు కొట్టారు. విచిత్రం ఏంటంటే వెంకటేష్ చేసే అన్ని రీమేక్ సినిమాలు మంచి ఫలితాలు అందుకోవడం విశేషం. చేసేది రీమేక్ అయినా తన మార్క్ నటనతో మెప్పిస్తాడు వెంకటేష్ అందుకే వెంకటేష్ రీమేక్ సినిమాలన్ని మంచి విజయాలు సాధిస్తూ వచ్చాయి. లేటెస్ట్ గా అసురన్ రీమేక్ గా నారప్పగా వచ్చిన వెంకీ మరోసారి సూపర్ అనిపించుకున్నాడు.

నారప్ప సినిమాలో వెంకటేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో వెంకీ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నారప్ప సినిమా చూసిన తర్వాత వెంకటేష్ రీమేక్ స్పెషలిస్ట్ ఎందుకు అయ్యాడో అర్ధమవుతుంది. అయితే ఈమధ్య వేరే స్టార్ హీరోలు కూడా రీమేక్ సినిమాలు చేస్తున్నారు. వారికందరికి రిఫరెన్స్ వెంకటేష్ అని చెప్పొచ్చు. రీమేక్ చేసే సినిమా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి దాని ఒర్జినల్ వర్షన్ కూడా గుర్తుకు రానంతగా అలరిస్తాడు వెంకటేష్.

ఇక రాబోతున్న రీమేక్ సినిమాలకు మిగతా స్టార్స్ కు కూడా వెంకటేష్ మంచి రిఫరెన్స్ అని చెప్పొచ్చు. కథ ఎలాంటిదైనా వేరే భాషలో ఎవరు నటించినా తన దగ్గరకు వచ్చాక తన నటనతో మెప్పించడమే అన్నట్టు వెంకీ సత్తా చాటుతాడు. నారప్ప సినిమాతో వెంకటేష్ మరోసారి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారాడు. నారప్ప సక్సెస్ తో వెంకీ రీమేక్ సినిమాలకు తానే పర్ఫెక్ట్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. నారప్ప సినిమా తర్వాత వెంకటేష్ దృశ్యం 2 తెలుగు రీమేక్ లో కూడా నటిస్తున్నారు. ఆ సినిమాతో కూడా వెంకటేష్ మరోసారి తన సత్తా చాటనున్నారు. తెలుగులో రీమేక్ అనగానే ఏ సినిమా అయినా సరే వెంకటేష్ గుర్తుకొచ్చేలా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: