ఒక కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా కెరీర్ ను ప్రారంభించి ఆ తరువాత హీరోలు అయిన వారు ఉన్నారు. కనీ హీరోగా వారు చాలా కాలం ఇండస్ట్రీలో కొనసాగలేరన్నది ఇప్పటి వరకు మనము చూసిన ఉదాహరణలను బట్టి తెలుస్తోంది. అందులో కమెడియన్ సునీల్, అలీ, వేణు మాధవ్, సప్తగిరి మరియు శకలక శంకర్ లాంటి వారు. ఇప్పుడు వారిలాగే మరో కమెడియన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుహాస్ హీరోగా తన కెరీర్ ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. సుహాస్ మొదటి సినిమాతోనే బంపర్ హిట్ ను సాధించి టాలీవుడ్ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు. గత సంవత్సరం రిలీజ్ అయిన 'కలర్ ఫోటో' చిత్రాన్ని ప్రేమికులు మరియు ప్రేక్షకులు ఎన్నటికీ మరువలేరు. అంతగా ప్రేక్షకుల్ని ఆకుట్టుకుంది ఈ చిత్రం. ఈ సినిమా ద్వారా తొలి సారిగా హీరోగా తన టాలెంట్ ను చూపించాడు సుహాస్. ఈ మూవీలో తన పంచ్ లతో కడుపుబ్బ నవ్విస్తూనే, సెంటిమెంట్ సీన్లలో జీవించి కంటినిండా నీరు తెప్పించాడు.

కాగా సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న రెండో చిత్రం  ‘ఫ్యామిలీడ్రామా’. టైటిల్ చాలా వెరైటీగా ఉంది కదా, కాన్సెప్ట్ ఇంకా కొత్తగా, భిన్నంగా ఉండబోతోందని అంటున్నారు మేకర్స్.  సరికొత్త కథనంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి మెహెర్‌ తేజ్‌ దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, తేజ కాసరపుతో కలిసి మెహెర్‌ తేజ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ్రిల్లర్‌ క్రైమ్‌ డ్రామాగా ఈ సినిమాని రొటీన్ కి భిన్నంగా కొత్త కోణంలో మన ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్‌లుక్‌ని మంగళవారం నాడు సోషల్ మీడియా వేదికపై విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హీరో సుహాస్ కొత్త లుక్ తో దర్శనమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ ని త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తామని వెల్లడించింది చిత్ర బృందం.  ఈ మూవీకి ఛాయాగ్రహణం వెంకట్‌ ఆర్‌. శాఖమూరి కాగా అజయ్‌, సంజయ్‌ లు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. షణ్ముఖ ప్రశాంత్‌, మెహెర్‌ లు కలిసి ఈ చిత్రానికి కథ కథనం అందిస్తున్నారు. కలర్ ఫోటో చిత్రంతో తన ప్రతిభకు అద్దం పట్టిన హీరో సుహాస్ ఈ సినిమాలో అంతకు మించిన నటనా కౌశల్యాన్ని ప్రదర్శిస్తారని అభిమానులు ఆకక్షిస్తున్నారు . సుహాస్ కూడా ఈ సినిమా తనకు మరో బ్రేక్ త్రూ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రెండో సినిమా కూడా హిట్ అవుతుందా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: