సినిమా ఇండస్ట్రీ అనేది కేవలం రంగుల ప్రపంచం మాత్రమే కాదు, అదొక మాయా ప్రపంచం కూడా . ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత కష్టనష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి . అప్పుడే సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ గా ఎదగడానికి అవకాశం వుంటుంది. మనం ఏదైనా పని చేసేటప్పుడు తప్పకుండా విజయం సాధించాలి అంటే, అది ఎన్నటికీ నెరవేరదు. అపజయం కూడా విజయానికి నాంది అని తెలుసుకోగలిగిన అప్పుడే, ఏ రంగంలోనైనా ముందుకెళ్లడానికి వీలుగా ఉంటుంది. ఇక మన సినీ ఇండస్ట్రీలోని నటుల విషయానికి వస్తే, ఒకటి రెండు సినిమాల్లో మంచి విజయాన్ని సాధించి, ఆ తర్వాత వరుస ప్లాప్ లు కనుక వస్తే , వారు తీవ్ర మనస్థాపానికి గురి అయ్యి,  చనిపోయిన వారిని కూడా చాలా మందిని చూశాను.

ఇకపోతే అలాంటి వారిలో మన ఈవీవీ సత్యనారాయణ కూడా ఒకరు. ఈయన మొదట ప్రముఖ దర్శకుడు జంధ్యాల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.ఇక ఆ  తరువాత దర్శకుడిగా మొదటి చిత్రం చెవిలో పువ్వు. ఇక మొదటి ప్రయత్నంతోనే పరాజయాన్ని పొందడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు ఈ వి వి సత్యనారాయణ. ఇక సినీ ఇండస్ట్రీని వదిలి పెట్టాలని కూడా నిశ్చయించుకున్నాడు. అంతే కాదు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో, ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు, ఈవీవీ సత్యనారాయణ కు ఫోన్ చేసి మరీ ఒక అవకాశాన్ని ఇచ్చాడు.

ఆ సినిమానే ప్రేమ ఖైదీ. ఈ చిత్రానికి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు . ఇక ఈ సినిమా ఊహించని విధంగా దాదాపు అన్ని థియేటర్లలో విజయవంతంగా ఆడి , మంచి విజయాన్ని అందుకుంది. ఇక అంతే ..ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా విజయవంతం అందుకోవడంతో ఆయన వెనుతిరిగి చూడలేదు. ఇక ఆయన గురువు జంధ్యాల నేర్పిన మార్గాన్ని పాటిస్తూ.. మంచి మంచి కామెడీ సినిమాలకు ప్రాణం పోస్తూ, ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందాడు ఈవీవీ సత్యనారాయణ.

మరింత సమాచారం తెలుసుకోండి: