బుల్లితెర హిస్టరిలోనే సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఎన్నో ఏళ్ళ నుండి ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. జబర్దస్త్ తర్వాత పోలీసులకు ఎన్నో కామెడీ షోస్ వచ్చాయి. కానీ జబర్దస్త్ ను మాత్రం పడగొట్టా లేకపోయాయి. జబర్దస్త్ కేవలం ప్రేక్షకులకు కామెడీని పంచడమే కాదు ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది అని చెప్పాలి  జబర్దస్త్ ద్వారా ఎంతోమంది గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో కూడా వరుస అవకాశాలు అందుకుంటున్నారు.  అయితే జబర్దస్త్ షో లో ఎప్పుడు ఏదో ఒక జంట హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


 జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి సుడిగాలి సుధీర్ రష్మీ జబర్దస్త్ లో ఫేవరెట్ జోడి గా మారిపోయింది. దీంతో సుడిగాలి సుధీర్ రష్మి జంట ఎక్కడైనా స్టేజ్ మీద కనిపించారు అంటే చాలు ప్రేక్షకులు అందరూ ఎంతగానో మురిసిపోయేవారు. అయితే ఆ తర్వాత కాలంలో హైపర్ ఆది-అనసూయ జంట కాస్త ఫేమస్ అయ్యింది. ఇటీవలే  జబర్దస్త్ లో బాగా ఫేమస్ అయిన జంట వర్ష ఇమ్మానుయేల్. ప్రస్తుతం జబర్దస్త్ బ్లాక్ అండ్ వైట్ జోడిగా కొనసాగుతుంది ఈ జంట.  ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను ఏకంగా అందరిముందే కెమెరా ముందు వ్యక్త పరచుకుంటూ ఇక ప్రస్తుతం జబర్దస్త్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ జంట.



 అయితే ఇప్పటికి కూడా ప్రేక్షకులు వీరిద్దరు నిజంగానే లవ్ చేసుకుంటున్నారా అని నమ్మలేకపోతున్నారు. అయితే అప్పుడప్పుడు వీరి లవ్ కి సంబంధించి కూడా స్కిట్ లో కూడా పంచ్ లు పేలుస్తూ ఉంటారు.  ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో లో భాగంగా ఎప్పుడూ అందంగా స్కిట్ లో నటించే వర్ష ఏకంగా చిరిగిన బట్టలు వేసుకుని అడుక్కునే అమ్మాయిలాగా వస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక వర్షను చూసిన ఇమ్మానియేల్ నిన్ను హీరోయిన్ గా చేస్తా అని అంటూ చెబుతాడు.  నేను పిచ్చిదాన్ని సార్ అని చెబుతోంది వర్ష.. తెలుసు నువ్వు పిచ్చి దానివి కాబట్టే నన్ను లవ్ చేసావ్ అంటూ ఇమ్మానియేల్ చెప్పడంతో వర్ష  ఒక్క సారిగా షాక్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: