తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో ఒకరు అయిన‌ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కెరీర్లో ఎన్నో మరుపురాని పాత్రలు చేశారు. పౌరాణికం అయినా... సాంఘీకం అయినా.. ఏ క్యారెక్టర్ లో అయినా ఎన్టీఆర్ ఇట్టే ఒదిగిపోయే వారు. ఎన్టీఆర్ తో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు , దర్శకరత్న దాసరి నారాయణరావు లాంటి పెద్ద డైరెక్టర్లు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించారు. కె.రాఘవేంద్రరావు - ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే అప్పట్లో ఒక సంచలనం. వీరిద్దరి కాంబినేషన్లో వేటగాడు - అడవి రాముడు లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. దాసరి - ఎన్టీఆర్ అంటే పవర్ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. బొబ్బిలి పులి , సర్దార్ పాపారాయుడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి.

ఎన్టీఆర్ కెరీర్ పరంగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నప్పుడు... అప్పుడు వరుస హిట్లతో దూకుడు మీద ఉన్న ఏ కోదండరామిరెడ్డిని పిలిచి తన సినిమాకు దర్శకత్వం వహించమని కోరార‌ట‌. తమిళంలో హిట్ అయిన గౌరవం సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. అందులో ఎన్టీఆర్ హీరో .. కోదండరామిరెడ్డిని పిలిచి ఆ క‌థ‌ను తెలుగులో తాను హీరోగా డైరెక్షన్ చేయమని చెప్పారట. అయితే అప్పటికే కోదండరామిరెడ్డి కొందరు నిర్మాతలకు కమిట్ అవ్వడం తో పాటు.. డేట్లు ఇవ్వడంతో వారు ముందుగా తమ సినిమాలు పూర్తి చేయాలని కండీషన్ పెట్టారట.

దీంతో కోదండరామిరెడ్డి ఈ విషయాన్ని ఎన్టీఆర్ కు చెప్పగా... ఎన్టీఆర్ కోదండరామిరెడ్డి తో సరే బ్రదర్ ముందుగా మీ కమిట్మెంట్ లు పూర్తి చేయండి అని చెప్పారట. అలా ఎన్టీఆర్ తో ఛాన్స్ వచ్చినా కోదండరామిరెడ్డి సినిమా చేయలేకపోయారు. అలా వీరిద్దరి కాంబినేషన్లో ఆ తర్వాత కూడా సినిమా రాలేదు. ఈ విష‌యంపై కోదండ రామిరెడ్డి ఇప్ప‌ట‌కీ బాధ‌ప‌డుతూనే ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: