1948 లో మధుబాల లాల్ దుపట్టా అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత సంవత్సరంలో మహల్ అనే సినిమాలో నటించి, సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది . ఈమె అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి, అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అదే సమయంలో నే బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో గా చలామణి అవుతున్న దిలీప్ కుమార్ తో ప్రేమలో పడింది. దిలీప్‌ను మధుబాల పీకల్లోతూ ప్రేమతో ముంచెత్తేసింది.
1951 సంవత్సరానికి మధుబాల అంతర్జాతీయంగా హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇక 1954వ సంవత్సరంలో బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ తో ప్రేమలో పడిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా వీరిద్దరూ అప్పట్లో డేటింగ్ లో కూడా ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా చాలా గట్టిగా వినిపించాయి. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో వీరి బంధం బ్రేకప్ అయింది. ఇక 1969 వ సంవత్సరంలో ఆమె గుండెకు చిల్లు పడడంతో మరణించింది.