అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన
నాగచైతన్య కెరీర్ స్టార్టింగ్‌లో కొంచెం తడబడ్డా తర్వాత తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు. యువసామ్రాట్‌గా,
రొమాంటిక్ హీరోగా మంచి సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. అక్కినేని
నాగార్జున తనయుడు అనిపించుకునేంతలా
రొమాంటిక్ మూవీస్ చేశాడు. టాలీవుడ్లో విజయం సాధించిన
చైతన్య బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్
అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’తో
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రంలో
నాగచైతన్య కీ రోల్ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా, చైతన్యకు సినిమాలతో పాటు క్రీడలపైనా ఆసక్తి ఉంది.
బ్రిటన్‌లో ఎఫ్ 1 రేసర్‌గా
చైతన్య రాణించాడు.
క్రికెట్ పట్ల కూడా చైతన్యకు మక్కువే. ‘మజిలీ’ ఫిల్మ్‌లో క్యారెక్టర్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు చై. తాజాగా
చైతన్య మంచి
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అని ప్రూవ్ అయింది.
బాలీవుడ్ నటులు, ‘లాల్ సింగ్ చద్దా’
మూవీ యూనిట్ సభ్యులతో
టెన్నిస్ ఆడుతున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో
నాగచైతన్య వెరీ ఫిట్‌గా దర్శనమిస్తున్నాడు. ఈ లుక్‌ను బట్టి చై
బాలీవుడ్ ఫిల్మ్ కోసం ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల అమీర్ ఖాన్-కిరణ్ రావుతో కలిసి
చైతన్య దిగిన ఫొటో ఒకటి ట్రెండయిన సంగతి తెలిసిందే.
అమీర్ ఖాన్, కిరణ్ రావు తదితర నటీనటులతో
నాగచైతన్య టెన్నిస్ ఆడినట్లు తెలుస్తోంది.
మూవీ సెట్స్‌లో సీన్ల చిత్రీకరణ సమయంలో మధ్యలో బ్రేక్ టైంలో
మూవీ యూనిట్ సభ్యులందరూ
టెన్నిస్ ఆడారట. ఈ సంగతులు ఇలా ఉండగా సెన్సిబుల్
డైరెక్టర్ శేఖర్ కమ్ములతో
చైతన్య చేసిన ‘లవ్ స్టోరీ’
సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో చైతుకు జోడీగా మలర్
బ్యూటీ సాయిపల్లవి నటించింది. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.
నాగచైతన్య ఈ
సినిమా కాకుండా ‘మనం’ ఫేమ్
డైరెక్టర్ విక్రమ్.కె.కుమార్‌తో ‘థాంక్యూ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తుండగా, ఇందులో చై క్యారెక్టర్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయట. ఈ చిత్రంలో చైతు సరసన రాశీఖన్నా నటిస్తోంది.