ఇటీవల కాలంలో ఎలాంటి ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తున్న వ్యక్తులు యాక్టర్స్‌గా, డైరెక్టర్స్‌గా టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే నూతన నటీనటులతో నూతన దర్శకుడు తెరకెక్కించిన చిత్రం ‘మిస్సింగ్’. ఇందులో
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించారు.  ఈ సినిమాను బజరంగబలి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాతో శ్రీని జోస్యుల డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు.  ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ ఈ రోజు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి హాజరై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవేంటంటే..

 
కొవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన రంగాల్లో సినిమా రంగం తప్పక ఉంటుంది. కొత్త సినిమాలు కూడా ఓటీటీ  బాట పడుతుండటంతో థియేటర్ల పరిస్థితి అధ్వానంగా తయారయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలు టాకీసుల్లో విడుదల చేసేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. థియేటర్లు కూడా చాలా రోజుల తర్వాత ఇటీవలే ఓపెన్ అయ్యాయి. ఇక అన్ని సినిమాల్లే ‘మిస్సింగ్’ ఫిల్మ్ కూడా కరోనా ఎఫెక్ట్‌తో చిత్రీకరణ ఆలస్యమైనట్లు నిర్మాత భాస్కర్ తెలిపారు. ఈ సినిమాకు హీరో, డైరెక్టర్ అయిన ఇద్దరు తమ పిల్లలేనని, తాను డైరెక్టర్ తండ్రినని భాస్కర్ చెప్పారు. హీరో ఫాదర్ శేషగిరి రావు మరో నిర్మాతనని పేర్కొన్నాడు.

సినిమా చేయాలనే తపన వారికి ఉన్నట్లుగానే తనకు ఉందని, అందుకే సినిమా చేశానని వివరించాడు. తమ అబ్బాయి డైరెక్టర్ మారుతి అంత గొప్పవాడు కావాలని, తాను బన్నీ వాసు అంత గొప్ప ప్రొడ్యూసర్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపాడు.  ఇది తమ మొదటి ప్రయత్నమని, మంచి చిత్రానికి సపోర్ట్ ఇవ్వాలని మరో నిర్మాత లక్ష్మీశేషగిరిరావు కోరారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ..‘మిస్సింగ్’ ట్రైలర్ చూస్తుంటే క్వాలిటీ ఫిల్మ్ కనిపిస్తోందన్నారు. మనల్ని లైఫ్ లో నమ్మాల్సింది తండ్రియేనని, అలాంటి ఆ తండ్రే ప్రోత్సహించి వీళ్లను సినిమాల్లోకి తీసుకొచ్చారని చెప్పారు. మిస్సింగ్ టైటిల్ లాగే ఈ సినిమాను ఎవరూ మిస్ అవరు అనుకుంటున్నానని పేర్కొన్నారు. తప్పకుండా ప్రేక్షకులు ‘మిస్సింగ్’ సినిమా చూస్తారని, సక్సెస్ మీట్‌కు కూడా తనను పిలవాలని కోరారు. సినిమా మంచి విజయం సాధించాలని ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: