కోలీవుడ్ లో ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీ రాబోతుంది. విశాల్, ఆర్య కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎనిమీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రీసెంట్ గా రిలీజైంది. సినిమా టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించడమే కాకుండా ఓ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వస్తుందని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో ఎనిమీ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ చూశాక తెలుగు ఆడియెన్స్ లో ఒక ఆలోచన వచ్చింది.

ఎనిమీ లాంటి యాక్షన్ సినిమా తెలుగు హీరోలు చేస్తే ఎలా ఉంటుంది అన్నది ప్రేక్షకుల ఆలోచన. ఆల్రెడీ విశాల్, ఆర్య కలిసి చేస్తున్న ఎనిమీ తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సో ఎనిమీ రీమేక్ కు ఛాన్స్ లేదు. ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటే మాత్రం ఇద్దరు స్టార్ హీరోలే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నటించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా హీరో అయ్యాడు కాబట్టి ప్రభాస్ తో మరో హీరోని జోడీ చేసి ఈ సినిమా తీస్తే అదిరిపోతుందని అంటున్నారు.

ఇంతకీ ప్రభాస్ తో ఎవరు సూట్ అవుతారు అంటే రాం చరణ్ అని అంటున్నారు. విశాల్, ఆర్య ఎనిమీ సినిమాలో ఇద్దరు స్నేహితులుగా చేస్తున్నారు. అందులో ఒకరు హీరో మరొకరు విలన్ ఇద్దరు కలిసి చేసే రచ్చ ఎలా ఉంటుదో టీజర్ తోనే రుచి చూపించారు. తప్పకుండా విశాల్ ఆర్య ఎనిమీ తెలుగులో కూడా మంచి ఆదరణ తెచ్చుకుంటుందని అంటున్నారు. ఒకవేళ ఎనిమీ లో స్టార్స్ ఎవరు నటించకుంటే మీడియం రేంజ్ హీరోస్ రాం, సాయి ధరం తేజ్ లాంటి వారైనా సరే చేస్తే ఆ సినిమా హంగామా వేరే రేంజ్ లో ఉండేదని అంటున్నారు. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఎనిమీ సినిమా విశాల్, ఆర్యలకు హిట్ ఇచ్చేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: