కోలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకరు అయిన శంకర్. అనతి కాలంలోనే అగ్రదర్శకుడిగా ఎదిగారు శంకర్. తన మొదటి సినిమాతోనే భారీ విజయం అందుకున్నారు. శంకర్ తన మొదటి చిత్రాన్ని యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా జెంటిల్ మెన్ అనే సినిమా తీసాడు. ఈ సినిమా శంకర్ ఎంత గొప్ప దర్శకుడో నిరూపించింది. తరువాత కమల్ హాసన్ తో భారతీయుడు సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమాలో పాటలు చాలా  విజువల్ వండర్ గా నిలిచాయి. ఆ సినిమా నుంచి శంకర్ పాటలను మంచి విజువల్స్ తో తెరకెక్కిస్తున్నాడు. శంకర్ అనగానే అందరికి భారీ  బడ్జెట్ ఉంటుంది  అని ఆలోచనలోకి వస్తుంది.ప్రస్తుతం ఆయన తీసిన ఎలాంటి సినిమా అయిన అంతగా ఆకట్టుకోవట్లేదు పెట్టిన భారీ బడ్జెట్ నిర్మాతకు వచ్చేస్తున్నా ఉహించినంత లాభం రావట్లేదు.ఒకప్పుడు మాత్రం శంకర్ పెట్టిన బడ్జెట్ కు రెట్టింపు లాభం వచ్చేది. ఖర్చు చేసిన ప్రతి రూపాయి కూడా తెరపై కనబడేది. అంత రిచ్ గా తీయడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఆయనతో పని చేసే నిర్మాతలు కూడా చాలా రిచ్ గా ఉంటారు.అయితే ఇప్పటి వరకు 100కోట్ల భారీ బడ్జెట్ సినిమా చేయని దిల్ రాజు మొదటిసారి శంకర్ తో పని చేస్తుండడం అందరికి ఒకటే ఆలోచన  వస్తుంది. ఏమిటంటే శంకర్ సినిమాకు దిల్ రాజు అంత భారీగా ఖర్చు పెడతాడా అని అనుకుంటున్నారు.

ఎలాంటి ప్లాన్ ఎంపిక చేసుకున్నారో గాని శంకర్ ముందే దిల్ రాజునుఒప్పించాడు. దిల్ రాజు సినిమా విషయంలో శంకర్ పై గట్టిగానే నమ్మకం పెట్టుకున్నాడు.నిజానికి ఈ కాంబినేషన్ లో సినిమా చాలా కాలం క్రితమే రావాల్సి ఉంది. కానీ సరైన కథ దొరకలేదు. శంకర్ తెలుగు సినిమా చేయడానికి సరైన సమయం రాలేదు.ఇక శంకర్ ఏ సినిమాను తెరకెక్కించిన కూడా తెలుగులో దిల్ రాజు ద్వారానే విడుదల చేయించేవారు. తెలుగులో ప్రొమోషన్స్ కూడా శంకర్ కు బాగా నచ్చేది. అందుకే దిల్ రాజుకు అవకాశం ఇచ్చి రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

ఇక ఈ సినిమా విషయంలో శంకర్ ఆలోచనలు కూడా చాలా ఖర్చుతో కూడుకొని ఉన్నాయి. మొదట భారీ బడ్జెట్ తోనే ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నాడట శంకర్. థమన్ ఇప్పటికే ఈ పాటకు మంచి మాస్ ట్యూన్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడట. ఆ పాట కోసం  సుమారు 1.5 కోట్లతో  భారీ సెట్ వేసి చిత్రీకరణ ప్రారంభించాలని శంకర్ చూస్తున్నాడట. సుమారు 135మంది మ్యూజిక్ టెక్నీషియన్స్ తో సాంగ్ ను సాంగ్ ను చిత్రికరిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేయనున్నాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ లో రూపొందనున్న ఆ పాటను సెప్టెంబర్ రెండవ వారంలో షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇక సినిమాను వచ్చే ఏడాది వేసవి లోపు పూర్తి చేస్తానని శంకర్ దిల్ రాజుకు మాట ఇచ్చారట. మరి ఆయన అన్నట్లుగానే పూర్తి చేస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: