ప్రతి సినిమా ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోలు ఉండటం కామన్.. చాలా ఇండస్ట్రీలలో ఈ పోటీ ఉంటుంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో చెప్పాలంటే కాస్త గట్టిగానే ఉంటుందని చెప్పాలి. ఇక నెంబర్ వన్ హీరో ఎవరా అని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తుంటారు.ఇక మన తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ హీరో ఎవరా అని తీవ్రంగా చర్చ నడుస్తుంది. గతంలో సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ నుంచి చిరంజీవి దాకా ఈ పోటీ గట్టిగానే నడిచింది. ఇక చిరంజీవి తరువాత నుంచి ఎవరు నెంబర్ వన్ హీరో అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక 5 గురు హీరోలు స్టార్ హీరోస్ గా కొనసాగుతున్నారు. వారిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎక్కువ ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలు. ఇక వీరిలో నెంబర్ వన్ హీరో ఎవరా అని టాలీవుడ్ ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఈ హీరోస్ అందరికి చాలా క్రేజ్ వుంది. ఎవరూ తక్కువేమి కాదు.కాని గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే వీరు మంచి ఫామ్ లో వున్నారని చెప్పుకోవాలి.

వీళ్ళందరిలో సీనియర్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుల మధ్య ఎప్పుడూ కూడా తీవ్రంగా నెంబర్ వన్ పోటీ అనేది నడుస్తుంది. ఖచ్చితంగా వీరిద్దరూ టాప్ 2 లో ఉంటారనే చెప్పాలి.ఒక్కోసారి పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ స్థానంలో ఉంటే ఒక్కోసారి మహేష్ బాబు నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు.కాని ఈసారి అందుతున్న లెక్కల ప్రకారం చూస్తున్నట్లైతే సూపర్ స్టార్ మహేష్ బాబు నెంబర్ వన్ హీరో అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి మహేష్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. వరుసగా మూడు రికార్డు హిట్లు అందుకొని టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా దూసుకెళ్తున్నాడు. అంతేకాదు సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు దాన్ని తెగ వైరల్ చేస్తూ మహేష్ ని టాప్ లో నిలబెడుతున్నారు ఫ్యాన్స్. ఇక మహేష్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ స్థానంలో, మూడవ స్థానంలో ప్రభాస్, నాలుగవ స్థానంలో ఎన్టీఆర్, ఐదవ స్థానంలో రామ్ చరణ్ ఆరవ స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారనే చెప్పాలి. ఇదంతా కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళకున్న హిట్లు, రికార్డులను పరిగణలోకి తీసుకొని వాళ్ళ స్థానాలను నిర్ణయించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: