మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కెరీర్ లో భారీ విజయం సాధించిన సినిమా మగధీర. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా విడుదలై 12 ఏళ్ళు కావస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ మూవీని గీత ఆర్ట్స్ బ్యానర్ పై విజయ వంతమైన నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు. పూర్వ జన్మల  ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రలలో నటించారు. శత్రువులను చెందాడే ధీరుడు కాలభైరవగాను, హీరోయిన్ ఇందు ను ప్రేమించే హర్షగా రెండు విభిన్న పాత్రల్లో నటించాడు రామ్ చరణ్. అలాగే కాజల్ కూడా తన అందాలతో ఆకట్టుకునే మిత్రవిందగా, మరియు ఇందు గా కనిపించి ఆకట్టుకుంది. ఇక  కాజల్ అగర్వాల్ ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా బాగా పాపులర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత కాజల్ కు తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. భారీ సెట్టింగ్ లతో ఒక మంచి విజువల్ వండర్‌గా తెరకెక్కిన మగధీర అప్పటి వరకు చూడని రికార్డులను క్రియేట్ చేసింది.అప్పటివరకు ఉన్న అన్ని రికార్డ్‌ లను ఈ సినిమా తుడిచేసింది

అప్పటి వరకు పూరీ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా 40కోట్లకు పైగా వసూళ్లు చేసి నెంబర్ వన్‌ సినిమాగా రన్ అవుతుంది.  అదే సమయంలో వచ్చిన మగధీర సినిమా పాత రికార్డులు తుడిచేస్తూ 40కోట్ల వసూల్‌ను చాలా త్వరగా దాటేసింది. ఈ చిత్రం 2009లోనే 80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రాజమౌళి స్టామినా ఏంటో నిరూపించింది. తెలుగు సినిమా స్థాయి కూడా మగధీర చాలా వరకు మార్చేసింది. రాజమౌళి తన దర్శక ప్రతిభ ఏవిధంగా ఉంటుందో ఈ చిత్రంతో మళ్లి నిరూపించారు. ఇక ఈ సినిమా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాను బాగా ట్రెండింగ్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన పోస్టర్లను పోస్ట్ చేస్తూ తెగ హడావిడి సృష్టిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో rrr సినిమాలో రామ్ చరణ్ నటిస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటించునున్నాడు రామ్ చరణ్. ఇదిలా ఉంటే ఇటీవల మగధీర సినిమాకు రెండవ భాగం రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల పై క్లారిటీ అయితే ఇంకా రాలేదు కానీ అభిమానులు మాత్రం ఈ సినిమాకు రెండవ భాగం రావాలని కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక రాజమౌళి నెరవేరిస్తాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: