దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన సినిమా. రవితేజ హీరో గా నటించిన ఈ సినిమా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో అద్భుతమైన ప్రేమకథా చిత్రంగా వచ్చి హిట్ అయ్యి రికార్డులకు ఎక్కింది. దూరదర్శన్ లో సీరియల్ గా చేద్దామని మొదట్లో ఈ సినిమా దర్శకుడు ప్రయత్నించగా అక్కడ రిజెక్ట్ అయింది. అయితే సినిమాగాగా చేయడం తో కోట్ల రూపాయలను దక్కించుకుంది ఈ సినిమా. పూరి జగన్నాథ్ మరియు రవి తేజ లకు మరపురాని హిట్ అందించిన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ లోనే విభిన్నకథా చిత్రం గా నిలిచింది.

కె బాలచందర్ తీసిన మరో చరిత్ర సినిమా లో పెద్దలు ఒప్పుకోలేదు అని ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోతారు. ఈ కంటెంట్ ను ఆదర్శంగా తీసుకొని కథను రాశారు పూరీ.  దానికి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే పేరు పెట్టి దూరదర్శన్ పంపిస్తే అక్కడ రిజల్ట్ చేశారట. మళ్లీ సినిమా టైటిల్ కొండచర్య అని పెట్టి పంపితే మళ్లీ రిజెక్ట్ చేశారు.  అలా దూరదర్శన్ నుంచి రిజెక్టు రావడంతో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథను పక్కన పెట్టారు. 

బద్రి తర్వాత తీసిన బాచి సినిమా ఫ్లాప్ కావడంతో ఈ కథను సినిమాగా చేయాలని భావించి మొదటగా హీరో సుమంత్ కి చెప్పగా ఆయనకు అది నచ్చలేదు. ఆ తరువాత తరుణ్ కి చెప్పగా ఆయన కూడా రిజెక్ట్ చేశాడు. చివరికి రవితేజ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు కానీ ప్రొడ్యూసర్ ఎవరు లేరు దాంతో పూరి జగన్నాథ్ ఏం చేయాలో అర్థం కాకుండా చూస్తుండటంతో రవితేజతో మంచి సన్నిహితంగా ఉన్న కొంతమంది లాయర్లతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. అలా ఈ సినిమా పట్టాలెక్కింది. తను రాయ్, సమ్రీన్ హీరోయిన్ లు గా నటించగా చక్రి సంగీతం అందించాడు. 2001 ఫిబ్రవరి 24 న షూటింగ్ ప్రారంభం కాగా 45 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: