సూపర్ స్టార్ మహేష్ హీరోగా త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్న ఆ సినిమాకి ఎస్ థమన్ సంగీతాన్ని అందించనున్నారు. ఇటీవల అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమాని మరొక రెండు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ జన్మదినం సందర్భంగా అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయనున్నట్లు టాక్. ఇక దాదాపుగా పదకొండేళ్ల తరువాత సూపర్ స్టార్ తో మాటల మాంత్రికుడు పని చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి.

అటు మహేష్ బాబు, ఇటు త్రివిక్రమ్ ఇద్దరూ కూడా మంచి సక్సెస్ లతో దూసుకెళ్తుండడంతో త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత సరికొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయం అని అప్పుడే చాలామంది అంచనాలు మొదలెట్టేశారు. ఇక ఈ సినిమా కథ మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగనుందని, మహేష్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ లో యాక్ట్ చేయనుండగా ఒక కీలకమైన పాత్ర లో బాలీవుడ్ కి చెందిన సీనియర్ నటి ఒకరు యాక్ట్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం.

ఇక అసలు విషయంలోకి వెళితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే దానిపై కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. కొందరేమో పూజా హెగ్డే అంటుంటే, మరికొందరేమో రష్మిక, జాన్వీ కపూర్, కియారా అద్వానీల పేర్లు ప్రచారం చేస్తున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందని, త్రివిక్రమ్ ఆమెకు కథని వినిపించి కాల్షీట్స్ కూడా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కాగా పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందిన సమాచారం ప్రకారం ఆ వార్తలో ఏ మాత్రం నిజం లేదని, ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ సహా పలు క్యారెక్టర్స్ కి ఆర్టిస్టులని ఫైనలైజ్ చేయాల్సి ఉందని, త్వరలోనే యూనిట్ వారి పేర్లు అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. దీనితో ఈ సినిమాలో జాన్వీ నటిస్తోంది అంటూ వస్తున్న పుకార్లకి పూర్తిగా అడ్డుకట్ట పడిందని అంటున్నారు విశ్లేషకులు .... !!



మరింత సమాచారం తెలుసుకోండి: