సోషల్ మీడియా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రపంచంలో జరిగిన ఏవిషయం అయినా క్షణాలలో అందరికీ అందుబాటులోకి వచ్చేస్తోంది. ఇక ఈ సోషల్ మీడియా మ్యానియాను ఉపయోగించుకుని ప్రముఖ రాజకీయ నాయకులు సినిమా సెలెబ్రెటీలు ప్రజలకు మరింత దగ్గర అయిపోతున్నారు.


ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే హడావిడికి ఆకాశమే హద్దుగా నిలుస్తుంది. ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ కొత్తగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఒక ట్విటర్ ఖాతా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పవన్ కు వీరాభిమానులు ఉన్నారు అన్న విషయం అందరికీ తెలిసిన విషయం తెలిసిందే. ‘పాక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్’ పేరుతో ఒక ట్విటర్ ఖాతా ఓపెన్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తల హడావిడి జరుగుతూ ఉండటంతో ఈ ఖాతా నిజంగానే నిజమా అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి.    



ప్రస్తుతం ఈ విషయం పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ సెలెబ్రెటీలకు పాకిస్థాన్ లో చాలామంది అభిమానులు ఉన్నారు అన్న విషయం ఓపెన్ సీక్రెట్ అక్కడి ప్రజలు ‘బాహుబలి’ మూవీని బాగా చూశారు అన్న గణాంకాలు కూడ ఉన్నాయి. అయితే ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ హీరోల హంగామా మన పొరుగు దేశంలో కూడ ఉంది అన్న వార్తలు ఇప్పటి వరకు రాలేదు.


దీనితో నిజంగానే పవన్ కు పాకిస్థాన్ లో అభిమానులు ఉన్నారా లేదంటే ఎవరైనా సంఘ వ్యతిరేక శక్తులు ఇలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ పేరును ఉపయోగించుకుంటున్నారా అన్న భయం పవన్ కళ్యాణ్ వీరాభినులకు ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి పవన్ కనిపిస్తే చాలు ఆవేశంతో ఊగిపోయే వీరాభిమానులు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ కు మన పొరుగు దేశం అయిన పాకిస్థాన్ లో కూడ అభిమానులు ఉన్నట్లు తెలుసుకుని పవర్ స్టార్ అభిమానులు ఆనందపడుతూనే లోలోపల భయపడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: