అదే సమయంలో వెండితెరపై కూడా సత్తా చాటుతూ.. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే మరి కొన్ని షోలలో యాంకరింగ్ చేస్తూ తన వాక్చాతుర్యంతో కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ టీవీ లో కొత్తగా ప్రారంభమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో యాంకర్ గా చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. యాంకరింగ్ తో రక్తి కట్టిస్తున్నాడు. సుధీర్ ఎక్కడ ఉన్నా సరే తన అమాయకమైన ఎక్స్ ప్రెషన్ తో కామెడీ పండిస్తూ ఉంటాడు. అదే సమయంలో అందరూ కూడా సుడిగాలి సుదీర్ ని ఒక ఆట ఆడుకుంటున్నారూ.
ఇక ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంకి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో లో భాగంగా టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న నటి ఆమని స్పెషల్ గెస్ట్ గా వస్తుంది. మేడం మీకు సుడిగాలి సుదీర్ గురించి తెలుసా అంటూ ఎవరో ఆమెను ప్రశ్న అడుగుతారు. ఎందుకు తెలియదు మా చావు కబురు చల్లగా అనే సినిమా మొత్తం సుడిగాలి సుదీర్ కు సంబంధించినదే కదా అని చెబుతుంది ఆమని. దీంతో అందరూ నవ్వుకున్నారు. మేడం నేను మీ సినిమాలో ఎక్కడ ఉన్నాను అంటే సినిమాలో లేవు కామెంట్లలో ఉన్నావు అంటూ ఆమని పంచ్ వేస్తుంది. దీంతో సుధీర్ షాక్ అవుతాడు. ఇలా తనదైన శైలిలో సుడిగాలి సుధీర్ ను ఒక ఆట ఆడుకుంటుంది ఆమని.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి