ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి తీస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. తొలిసారిగా ఈ స్టార్ హీరోలిద్దరితో ఎంతో ప్రతిష్టాత్మకంగా జక్కన్న తీస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 13న విడుదల కానుంది. అయితే దీని తరువాత సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ తీయనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్.
మ్యాటర్ ఏంటంటే, తన కెరీర్ లో దాదాపు చాలా సినిమాల చిత్రీకరణకు ఎక్కువ సమయం తీసుకున్న రాజమౌళి, ఇటీవల వచ్చిన బాహుబలి రెండు సినిమాలకు ఐదేళ్లు, అలానే ఆర్ఆర్ఆర్ కి దాదాపుగా మూడేళ్ళ టైం తీసుకున్నారు. అయితే అదే విధముగా త్వరలో తమ హీరోతో చేయబోయే సినిమాని కూడా రాజమౌళి దాదాపుగా మూడేళ్లకు పైగా తీసే ఛాన్స్ కనపడుతోందని, ఆవిధంగా మహేష్ సినిమా కోసం తాము చాలా సమయం వెయిట్ చేయక తప్పేలా లేదని పలువురు మహేష్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి తన సినిమాల షూటింగ్ కి భారీ టైం తీసుకునే జక్కన్న మహేష్ మూవీ కోసం ఎంత టైం తీసుకుంటారో చూడాలి ....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి