బాలీవుడ్ సెన్సేషనల్
బ్యూటీ కంగనా రనౌత్ ఎప్పుడు వివాదాలతోనే కాపురం చేస్తూ ఉంటుంది. ఆ మధ్య
ముంబై రాజకీయాలలో వేలుపెట్టి చాలా ఇబ్బందులు పడినా వారికి తగ్గట్లుగా సమాధానం చెప్పి తాను ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అన్నది స్పష్టం చేసింది. తాజాగా మరొక వివాదాస్పద ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. వివాదాల్లో చిక్కుకోవడం కన్నది కొత్తేమి కాకపోయినా ఇందులో తన ప్రమేయం లేకుండా కూడా ఆమె పేరు ఈ వివాదం లో వినిపిస్తుంది.
బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే ఆమెను ఎప్పటినుంచో టార్గెట్ చేశాడు. ఈనేపథ్యంలో
కంగనా పై ఓ ట్వీట్ వేశాడు. దీంతో అది సోషల్
మీడియా లో హల్చల్ చేస్తుంది. సెలబ్రిటీల పై వివాదాస్పద ట్వీట్ లు చేస్తూ వార్తల్లో నిలిచే కె.ఆర్.కె కంగనారనౌత్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా పోస్టులు పెడుతున్నాడు.
బాలీవుడ్ లో ఎక్కువగా వివాదాల్లో నిలిచే కంగనారనౌత్ నటనలో తనకు తానే సాటి అనే విధంగా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.
ఇక ఆమె ఏం చేసినా అది వివాదాస్పదమే అవుతున్న నేపథ్యంలో కేఆర్ కే తన ట్విటర్లో ఈజిప్టుకు చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి తో డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడించాడు. దీన్ని
లవ్ జిహాద్ గా పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు
బాలీవుడ్ లో
కంగనా ను లక్ష్యం చేసుకోవడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కంగనా కి సంబంధించిన రెండు ఫోటోలను కూడా ట్వీట్ చేశాడు. అందులో ఓ వ్యక్తితో ఆమె ఎంతో చనువుగా ఉందని పేర్కొన్నాడు. కానీ ఆ ట్వీట్ వెంటనే తొలగించాడు. అప్పటికే అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో కేఆర్ కే ఈ ట్వీట్ చేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ప్రజల నుంచి కూడా పెద్ద మొత్తంలో విమర్శలు రావడంతో దాన్ని తొలగించాడు. దీనిపై బాలీవుడ్లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది.
కంగనా తరపు
న్యాయవాది ఈ పుకార్ల విషయంలో తప్పు చేయకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.