వర్క్ ఫ్రం హోం.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారిపోయింది.  భర్తలకు వర్క్ ఫ్రం హోం ఎంతో భారంగా మారిపోయింది. అదేంటి కేవలం భర్తలకు మాత్రమే వర్క్ ఫ్రం హోం భారంగా మారి పోవడం ఏంటి అని అనుకుంటున్నారా.. సాధారణంగా ఆఫీసులో అయితే స్నేహితులందరి తో కలిసి ఎంతో ఉల్లాసంగా పని చేసుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం ఇక వర్క్ ఫ్రం హోం పేరుతో 24 గంటలు భార్య ను పక్కనే పెట్టుకుని పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  మామూలుగా కొంత సమయం భార్య పక్కన ఉంటేనే భార్యతో వాధించడం కష్టం అలాంటిది ఇరవైనాలుగు గంటల పాటు భార్య పక్కన కూర్చుంటే ఇక భర్తలకు వర్క్ ఫ్రం హోం భారంగా మారకపోతే ఇంకేం జరుగుతుంది.



 అంతేకాదు ఒకప్పుడు భర్త ఆఫీస్ కి వెళ్తే ఎంతో జాగ్రత్తగా వంట చేసి బాక్స్ ప్రిపేర్ చేసేది భార్య. కానీ ఇప్పుడు ఇక భర్త కూడా ఇంట్లోనే ఉండడంతో భర్తతో కూడా పని చేయించుకుంటుంది. ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటారా.. భర్తలు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సమయంలో భార్యలు ఎలా ఫీలవుతున్నారు అన్న విషయాన్ని ఇటీవల జబర్దస్త్ రాకెట్ రాఘవ చెప్పేసాడు.  ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఎంతో మంది నెటిజన్లు ఆకర్షిస్తుంది.  జబర్దస్త్ ప్రోమో లో భాగంగా రాకెట్ రాఘవ స్కిట్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఇక రాకెట్ రాఘవ స్కిట్ వస్తున్న సమయంలో ఒకప్పుడు వర్క్ ఫ్రం హోమ్ రాకముందు ఇక ఆఫీసుకు వెళ్ళి పని చేసినప్పుడు ఆమ్మో మా భర్త ఆఫీస్ కి వెళ్లి ఏదో పీకే చేస్తున్నాడు అని అనుకొనేది ణా భార్య.. కానీ వర్క్ ఫ్రం హోం వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ ఉంటే వీడు పీకేది ఇంతేనా  అని అనుకుంటుంది అంటూ పంచు వేసాడు రాకెట్ రాఘవ. దీంతో అక్కడున్న వారందరూ పగలబడి నవ్వుకుంటారు. అయితే ఈ డైలాగ్ ప్రస్తుతం ఎంతో మంది భర్తలకు కనెక్ట్ అయింది అని చెప్పాలి.  అంతేకాదు ఇక భార్యలు యూట్యూబ్ ఛానల్ పెడితే భర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అన్న విషయాన్ని కూడా కళ్ళకు కట్టినట్లు చూపించాడు రాకెట్ రాఘవ.

మరింత సమాచారం తెలుసుకోండి: