టాలీవుడ్ ‘గూఢచారి’, కంటెంట్ ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అడివి శేష్ ఇప్పుడు ఒక ఇంటెన్సివ్ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్‌తో బాక్సాఫీస్ దగ్గర గర్జించడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా, ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ‘డెకాయిట్’ (Decoit) చిత్రం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగా, అక్కినేని మరియు నందమూరి అభిమానుల సమక్షంలో ఒక ‘మాస్’ జాతరను తలపించింది. అడివి శేష్ మార్క్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు, మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తోడవడంతో ఏప్రిల్ 10న బాక్సాఫీస్ వద్ద రికార్డులు వేటాడటం ఖాయమనిపిస్తోంది.


ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన విక్టరీ వెంకటేష్ తనదైన శైలిలో సినిమా టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు."అందరూ నేను సుప్రియ కోసం వచ్చానని అనుకుంటున్నారు కానీ, నిజానికి సురేంద్ర మావయ్య (అక్కినేని నాగేశ్వరరావు గారి అల్లుడు) కోసం వచ్చాను. ఆయన నాకు చాలా స్పెషల్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో సుప్రియ ఇంత మంచి సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది" అని వెంకీ మామ ఎమోషనల్ అయ్యారు. "పంజా సినిమా నుంచి శేష్ ప్రతిభ నాకు తెలుసు. ఆయన చేసిన సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ‘డెకాయిట్’ ట్రైలర్ చూస్తుంటేనే ఇది బ్లాక్ బస్టర్ అని అర్థమవుతోంది. లవ్ స్టోరీలో ఇంత యాక్షన్ యాడ్ చేయడం చాలా కొత్తగా ఉంది" అని వెంకటేష్ సర్టిఫికేట్ ఇచ్చేయడంతో అక్కినేని ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.



హీరో అడివి శేష్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం టీమ్ పడ్డ రెండేళ్ల కష్టాన్ని వివరించారు."డెకాయిట్ నా హృదయానికి దగ్గరైన ప్రాజెక్ట్. డైరెక్టర్ షానియల్ డియో ఇప్పటికీ ఓవర్సీస్ ప్రింట్ల కోసం వర్క్ చేస్తూనే ఉన్నారు. రెండు సంవత్సరాల కష్టానికి ఫలితం ఏప్రిల్ 10న మీరు థియేటర్లలో చూస్తారు" అని శేష్ ధీమా వ్యక్తం చేశారు.సినిమాలో మృణాల్ ఠాకూర్ పోషించిన ‘సరస్వతి’ పాత్ర ఇంటర్వెల్ బ్లాక్‌లో హైలైట్ అవుతుందని, ఆ ఎమోషన్ ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుందని శేష్ లీక్ ఇచ్చారు. మృణాల్ కెరీర్‌లో ఇది ‘సీతారామం’ తరహాలో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది.



నిర్మాత సుప్రియ యార్లగడ్డ ఈ సినిమా కోసం పడ్డ తపనను ప్రతి ఒక్కరూ కొనియాడారు.అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో అక్కినేని కుటుంబ భావోద్వేగాలను జోడించి ఈ సినిమా లోగోను డిజైన్ చేశారు. సుమంత్ ఈ చిత్రానికి సైలెంట్ ప్రొడ్యూసర్‌గా వెనకుండి నడిపించినట్లు సుప్రియ వెల్లడించారు. ‘ధమాకా’ ఫేమ్ భీమ్స్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లిందని అడివి శేష్ ప్రశంసించారు. ‘మాస్’ బీట్స్ తో పాటు మెలోడీలు కూడా అద్భుతంగా వచ్చాయని టాక్.



ఈ వేడుకకు హాజరైన ‘టిల్లు స్క్వేర్’ స్టార్ సిద్దు జొన్నలగడ్డ తనదైన స్టైల్లో రచ్చ చేశారు. "శేష్ సినిమా అంటే అది మనందరి సినిమా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ చిత్రంతో శేష్ టాలీవుడ్‌లో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేశారు" అని సిద్దు పేర్కొన్నారు. బాలీవుడ్ మావెరిక్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుండటం సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ ఇచ్చింది. రాహుల్ రవీంద్ర, కార్తీక్ ఘట్టమనేని వంటి వారు కూడా సినిమాపై తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: