మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పట్లో వాణిజ్య ప్రకటనల్లో చేసేవారు. చిరంజీవి తొలిసారిగా థమ్స్ అప్ అనే ఒక సాఫ్ట్ డ్రింక్ వాణిజ్య ప్రకటనలో నటించి ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. థంసప్ కంపెనీ కి ప్రత్యర్థి కంపెనీ అయిన పెప్సీ కి పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా కొద్దిరోజుల పాటు పని చేశారు. అయితే చిరంజీవి హానికరమైన శీతల పానీయాన్ని ప్రమోట్ చేస్తున్నారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి చిన్న పిల్లలకు, పెద్దలకు హానికరమైన సాఫ్ట్ డ్రింక్ ఎలా ప్రచారం చేస్తారని దుయ్య బట్టారు. దీంతో చిరంజీవి ఒక్కసారిగా ఖంగు తిన్నారు.
తన సినిమాలతో దశాబ్దాలపాటు ప్రజలను అలరించి
మంచి పేరు తెచ్చుకున్న చిరుకి ఒకే ఒక వాణిజ్య ప్రకటన తో చెడ్డ పేరు రావడం ప్రారంభించింది. మరో పక్కన పవన్ కళ్యాణ్ పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో ఇద్దరు అన్నదమ్ములు ఆయా కంపెనీల డీల్ నుంచి బయటికి వచ్చేశారు. ఇకపై ప్రజలకు నచ్చని పనులు చేయమని నిర్ణయించుకున్నారు. అందుకే చిరంజీవి థమ్స్ అప్ యాడ్ తర్వాత మరే ఇతర కంపెనీ కోసం యాడ్స్ చేయలేదు. పవన్ కళ్యాణ్ కూడా కోట్లాది రూపాయల డీల్స్ తన ముందుకు వస్తున్న కూడా తిరస్కరిస్తారు.
నిజానికి
టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సినిమాల కంటే ఎక్కువగా బ్రాండ్ అంబాసిడర్స్ వాణిజ్య ప్రకటనల వంటి మార్గాల ద్వారా ఎక్కువగా డబ్బు సంపాదిస్తుంటారు. మహేష్ బాబు థంసప్ నుంచి సంతూర్, క్లోజ్ అప్, టాటా స్కై వంటి 20పైగా కంపెనీలకు ప్రకటనలు చేశారు. ఇప్పటికీ ఆయన చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూనే ఉన్నారు. అయితే నితిన్, నిఖిల్, గోపీచంద్,
అల్లరి నరేష్ వంటి హీరోలు ప్రజలను తప్పుదోవ పట్టించకూడదనే ఉద్దేశంతో వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటున్నారు. హీరోయిన్లలో
సాయిపల్లవి లాంటి అగ్రతారలు కమర్షియల్ యాడ్స్ కి చాలా దూరంగా ఉంటున్నారు. కాజల్, సమంత,
రష్మిక వంటి హీరోయిన్లు మాత్రం భారీ ఎత్తున యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.