టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా మరియు ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు సంపాదించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..ముఖంపై ఎప్పుడు చిరునవ్వుతో ఎంతోమందిని ఆకట్టుకున్న మహేష్ బాబు కి ఎక్కువగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని మనకు తెలిసిన విషయమే..ఈ విధంగా సినిపరిశ్రమలో స్టార్ హీరోగా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న మహేష్ బాబుకు ఒక పెద్ద ఆరోగ్య సమస్య ఉందనే విషయం చాలా మందికి తెలియదని సమాచారం.. ఈ సమస్య కారణంగానే మహేష్ బాబు తనకెంతో ఇష్టమైన కొన్ని పనులను వదులుకోవాల్సి వచ్చిందట.ఇంతకీ మహేష్ బాబుకు ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి..దీని కారణంగా ఎలాంటి ఇష్టానికి దూరమయ్యారు అనే విషయాన్ని cheppukunre.

మహేష్ బాబుకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే అమితమైన ప్రేమని సమాచారం.బ్యాట్ చేత పట్టాడు అంటే బాల్ బౌండరీ దాటాల్సిందేనట. అంతగా క్రికెట్ అంటే ఇష్టపడే మహేష్ బాబు స్కూల్ జీవితంలో ఎన్నో టోర్నమెంట్లలో ఆడుతూ విజయాలను అందుకునే వాడట.అయితే తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ను చర్మ సమస్య కారణంగా వదులుకోవాల్సి వచ్చిందని సమాచారం..మహేష్ బాబు చూడటానికి ఎంతో సెన్సిటివ్ గా ఉంటారనే సంగతి మన అందరికి తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే మహేష్ బాబు చర్మంపై అధికంగా వేడి, ఎండ పడినప్పుడు అతని చర్మం మొత్తం ఎరుపెక్కి, దద్దుర్లు ఏర్పడుతాయట.

ఈ విధంగా స్కూల్ టైం లో క్రికెట్ ఆడేటప్పుడు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్న మహేష్ బాబుకి కృష్ణ చెన్నైలోని ఒక మంచి చర్మవ్యాధి నిపుణుల దగ్గర చికిత్స చేయించగా తన చర్మం ఎంతో సెన్సిటివ్ అని అతను ఎంత ఎండకు తిరిగితే అంత సమస్య తీవ్రత అవుతుందని తెలిపినట్లు సమాచారం..ఈ క్రమంలోనే కొన్ని మందులు ఉపయోగించి ఆ సమస్య నుంచి బయట పడిన మహేష్ బాబు మరోసారి టోర్నమెంట్ లో పాల్గొన్నారట.. ఈ క్రమంలోనే ఆ సమస్య మరింత ఎక్కువ కావడంతో పూర్తిగా తనకెంతో ఇష్టమైన క్రికెట్ ను వదులుకోవాల్సి వచ్చిందని సమాచారం.. కేవలం క్రికెట్ ఆడటానికి కాకుండా చూడటానికి మాత్రమే పరిమితం అయ్యాడట మహేష్. ఈ విధంగా తన చర్మం పై అధిక ఎండ తీవ్రత  వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి సమస్య రావడం చేత సినిమాలో కూడా మహేష్ బాబు ఎక్కువగా చొక్కా లేకుండా మనకి కనిపించరని సమాచారం.ఏదిఏమైనప్పటికీ స్టార్ హీరోగా ఉన్నటువంటి మహేష్ కి ఇలాంటి సమస్య ఉండటం బాధాకరమని ఆయన అభిమానులు ఎక్కువగా బాధపడుతున్నారట.

Related Articles

మరింత సమాచారం తెలుసుకోండి: