
అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అయితే పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందు నుంచే పవర్ స్టార్ బర్త్ డే వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక పవర్ స్టార్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అటు ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేను పురస్కరించుకుని ప్రస్తుతం అభిమానులందరూ బర్త్ డే వేడుకలకు సిద్ధమవుతున్నారు. అయితే బర్త్ డే కి ఇంకా కొన్ని రోజులు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి ప్రేక్షకులు సెలబ్రేషన్స్ ప్రారంభించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కి పవన్ కళ్యాణ్ కి ఒక సాంగ్ డెడికేట్ చేస్తూ ఎంతో మంది యువతులు ఒక అదిరిపోయే పర్ఫామెన్స్ చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ లో అమ్మాయిలు చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రస్తుతం ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్ నటించిన ఒక్కో సినిమా నుంచి ఒక పాట తీసుకుని దానిపై డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇక ఆ తరువాత చివర్లో అమ్మానాన్న మన పవన్ కళ్యాణ్ ఎప్పటికీ బోరు కొట్టరూ అంటూ నటి ఇంద్రజ అదిరిపోయే డైలాగ్స్ తో ఆకట్టు కుంటుంది. ఇక ఆ తర్వాత అందరూ కలిసి పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అంటూ చెబుతారు. ఇక ఈ వీడియో కాస్త ప్రస్తుతం పవన్ అభిమానులను తెగ ఆకర్షిస్తుంది.