ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు ఆధిపత్యం సాధించడం తో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్  వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇంక తాలిబన్ల ఆధిపత్యం లోకి రావడంతో ఆఫ్ఘనిస్తాన్ తో అంతర్జాతీయ సమాజానికి ఉన్న అన్ని రకాల సంబంధాలు కూడా అయోమయంలో పడిపోయాయ్. ఇక మరికొన్ని రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రత్యేకమైన చట్టాలను అమలులోకి తీసుకు వచ్చేందుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారు.



 అయితే కేవలం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రజలు మాత్రమే కాదు వివిధ దేశాలలో ఉన్న ప్రజలు సైతం ఆఫ్ఘనిస్థాన్లో ఏర్పడిన పరిస్థితుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవలే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోవడం వల్ల ఏకంగా ఒక నటి నిశ్చితార్థం కూడా రద్దు అయ్యింది. బిగ్బాస్ సీజన్ 11,14 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకర్షించింది అర్షి ఖాన్.  బిగ్బాస్ ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది ఈ అమ్మడు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.



 ఇటీవల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిపోయింది అర్షి ఖాన్.  ఏడాది అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఒక క్రికెటర్ తో తన నిశ్చితార్థం జరగాల్సి ఉంది. కానీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకోవడంతో అది కాస్త రద్దయింది అంటూ అర్షి ఖాన్ తెలిపింది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసింది. తన తండ్రి సెలెక్ట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ తో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అతడు మా నాన్న స్నేహితుడి కుమారుడు. కానీ ఇటీవల తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోవడంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాం. అయినప్పటికీ మేము మంచి మిత్రులుగానే ఉంటున్నాము. ఇక ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అంటూ అర్షి ఖాన్  చెప్పుకొచ్చింది. భారతీయ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: