టాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తన మొదటి సినిమాతోనే స్టార్ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. అదే అల్లుడు శీను సినిమా.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత నటించడం విశేషం. అంతేకాకుండా ఈయన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ సపోర్టుతో, సినీరంగంలోకి అడుగుపెట్టాడు. అయితే ఈయన కి ఎంత ఆస్తి ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


ఎన్నో సినిమాలు తీసిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఆ సినిమాలు హిట్ , ఫ్లాప్ తో  సంబంధం లేకుండా తీస్తూనే ఉంటాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల ద్వారా ఎంత సంపాదించాడు అనే విషయం చాలా హాట్ టాపిక్ గా మారింది సిని ఇండస్ట్రీలో. ఈయన తన సినిమాల వల్ల ఆస్తులను పోగు చేశాడా ..?లేదా.. పోగొట్టుకున్నాడా..?అనే విషయం కూడా నెటిజన్లలో కలుగుతున్న సందేహం.


బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు దాదాపుగా 10  పై గా సినిమాలలో నటించారు. ఇలా తీసిన సినిమాలలో ఏ ఒక్క సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలేదనీ చెప్పుకోవచ్చు. ఏదో ఒకటో రెండో సినిమాలు బాగానే అలరించాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఎక్కువ సినిమాలు డిజాస్టర్ అయితే కనుమరుగైన హీరోలు చాలామంది ఉన్నారు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ అలా కాకుండా ఓ విభిన్నమైన కథలతో మన ముందుకు వస్తున్నాడు.


ఇక తన తండ్రి సహాయంతో ఆయన నటించిన కొన్ని సినిమాలు పలు భాషల్లో కూడా విడుదల చేస్తూ, ఎక్కువ అభిమానులను సంపాదించుకునే విధంగా చూస్తున్నారట. అలా కొన్ని సినిమాల శాటిలైట్ రైట్స్ కనుక్కొని బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ఆస్తి విలువ దాదాపుగా 250 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఒక్కో  సినిమాకి 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇక అంతే కాకుండా 15  కోట్ల రూపాయలు విలువచేసే రెండు ఖరీదైన బంగ్లాలు ఉన్నట్లు సమాచారం. ఇక మరికొన్ని లగ్జరీ కార్స్, బైక్స్  కూడా ఉన్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: