టాలీవుడ్ ఇండస్ట్రీ నే కాదు ఇండియన్ సినీ పరిశ్రమలో సైతం హడావిడి సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి. ఇప్పటి జనరేషన్ వారు తెలుగు సినిమా పరిశ్రమ అర్జున్ రెడ్డి కి ముందు అర్జున్ రెడ్డి కి తర్వాత అంటున్నారని సమాచారం. ఈ సినిమా ప్రేక్షకులను ఏవిధంగా  ఆకట్టుకున్నదో అర్థం చేసుకోవచ్చు.విజయ్ దేవరకొండ  స్టార్ హీరో కావడానికి ఈ సినిమా కారణం అయ్యిందని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేని పెళ్లి చూపులు సినిమాతో సినిమా పరిశ్రమకి వచ్చాడు. ఆ తరువాత వచ్చిన రెండో సినిమా అయిన అర్జున్ రెడ్డి సినిమా తోనే స్టార్ హీరో అవడం అంటే టాలీవుడ్ లో ఏ హీరో కి ఇది సాధ్యం కాదేమో అని చెప్పాలి..  

ఈ సినిమా ఇంత భారీ విజయం సాధించడానికి అస్సలు కారణం సినిమా కథ, కథనం మరియు దర్శకత్వం ఒక కారణం అని చెప్పవచ్చు.విజయ్ దేవరకొండ నటన ఈ సినిమాను తారా స్థాయికి చేరిందని సమాచారం. ఇప్పటికీ ఈ సినిమా ప్రభావం ఆ తరువాత తీసిన సినిమాలపై ఉందని సమాచారం. అడల్ట్ లవ్ స్టోరీ సినిమాలు అర్జున్ రెడ్డి సినిమా తర్వాతే పుట్టుకొచ్చాయి అని చెప్పవొచ్చు. ప్రేమ కథలను ఈ విధంగా కూడా తీయవచ్చా అన్న రీతిలో ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ చిత్రం సృష్టించిన భారీ సంచలనానికి నాలుగు సంవత్సరాలు పూర్తయినట్లు సమాచారం. అయినా ఇప్పటికీ ఈ సినిమా ను మర్చిపోలేకపోతున్నట్లు చెప్తున్నట్లు సమాచారం..  

ఇంత అద్భుతమైన నటన ఉన్న నటుడు టాలీవుడ్ కి దొరకడం అదృష్టమని ప్రేక్షకులు భావిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా ఇచ్చిన విజయోత్సాహంలో విజయ్ దేవరకొండ వరుస  విజయాలతో దూసుకుపోతూ అగ్రహీరోలకు సైతం పోటీ ఇచ్చే స్థాయికి చేరుకున్నాడని సమాచారం. త్వరలోనే అయన మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరో ల సరసన నిలుస్తాడని సమాచారం అందంలో సందేహం లేదని అందరు భావిస్తున్నారట. ప్రస్తుతం భారీ స్థాయిలో సినిమా చేస్తూ కోట్లాది మంది అభిమానులను దేశ వ్యాప్తంగా సంపాదించుకున్నాడట . అర్జున్ రెడ్డి సినిమా హిందీ లోనూ రీమేక్ కావడంతో తెలుగులో నటించిన విజయ్ దేవరకొండ కు అక్కడ మంచి గుర్తింపు వచ్చిందని సమాచారం.  

నిజం చెప్పాలంటే కబీర్ సింగ్ లో నటించిన సాహిద్ కపూర్ కంటే అర్జున్ రెడ్డి లో నటించిన విజయ్ దేవరకొండ నే ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడ్డారని సమాచారం.. హీరో షాహిద్ కపూర్ కూడా విజయ్ దేవరకొండ రేంజ్ లో నేను నటించలేను అని ఒప్పుకున్నారట. ఈ ఒక్క కామెంట్ తో విజయ్ దేవరకొండ రేంజ్ మారిపోయిందని సమాచారం. ఆ తర్వాత అయన చేసిన సినిమాలు గీత గోవిందం,మహానటి, డియర్ కామ్రేడ్, నోటా వంటి చిత్రాలతో ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నాడట.. విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే చాలు కోట్లాది మంది అభిమానులు సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తారని తెలుస్తుంది. మరి భవిష్యత్ లో అర్జున్ రెడ్డి లాంటి సినిమాలను విజయ్ దేవరకొండ నుంచి ఎన్ని వస్తాయో చూడాలి మరి .

మరింత సమాచారం తెలుసుకోండి: