ఆపై వెంకీ అట్లూరి తీసిన మిస్టర్ మజ్ను కూడా యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది. ఇక ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్ తో అఖిల్ చేసిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే కొన్నాళ్ల క్రితం ఫుల్ గా బాడీ పెంచి ప్రస్తుతం తన లేటెస్ట్ సినిమా ఏజెంట్ షూటింగ్ లో పాల్గొంటున్నారు అఖిల్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై అనిల్ అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఎంతో భారీ వ్యయంతో హై టెక్నీకల్ వాల్యూస్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్.
అయితే మూడు రోజుల క్రితం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ప్రత్యేకంగా సందడి చేసిన అఖిల్ ని చూసిన వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారట. అద్భుతమైన అందం, అంతకుమించి బాగా పెంచిన బాడీ, ఇవి రెండూ పెట్టుకుని కూడా కెరీర్ ని సరిగ్గా మలుచుకోవడం లేదని, తప్పకుండా మరింతగా ఫోకస్ చేస్తే రాబోయే కొద్దిరోజుల్లో అఖిల్ హీరోగా మంచి స్థాయికి చేరే ఛాన్స్ ఉందని వారు అభిప్రాయపడ్డారట. మరి రాబోయే రోజుల్లో తన సినిమాలతో అఖిల్ ఎంత మేర సక్సెస్ కొడతారో చూడాలని అంటున్నారు విశ్లేషకులు .... !!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి