భారీ అంచనాలతో రాబోతున్న ‘పుష్ప’ మూవీ కలక్షన్స్ విషయంలో రికార్డులను తిరగ వ్రాస్తుందని బన్నీ అభిమానులు భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈ మూవీకి సంబంధించిన టీజర్ కు అదేవిధంగా ఫస్ట్ సాంగ్ కు వచ్చిన భారీ స్పందన వచ్చిన అంచనాలు మరింత పెంచాయి. ఈ సంవత్సరం కరోనా థర్డ్ వేవ్ భయాలు పూర్తిగా తగ్గిపోయిన తరువాత ఏసినిమాకు అడ్డురాని విధంగా ఈమూవీని క్రిస్మస్ రేస్ కు దింపే విధంగా అధికారిక ప్రకటన ఇచ్చారు.


వచ్చే ఏడాది సంక్రాంతికి అనేక భారీ సినిమాలు పోటీ పడుతూ ఉండటంతో ఆ పోటీ తనకు ఎందుకని బన్నీ ముందు ఆలోచనలతో క్రిస్మస్ ను ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ ఖచ్చితంగా అక్టోబర్ నవంబర్ లలో రావడం ఖాయం అన్న సంకేతాలు వస్తున్న పరిస్థితులలో దసరా కు రావలసిన ‘ఆచార్య’ తన ఆలోచన మార్చుకుని సంక్రాంతి రేస్ లోకి ఎంటర్ అవ్వాలని మొదట్లో భావించింది.


అయితే పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ ఇప్పుడు సంక్రాంతి రేస్ కు ఫిక్స్ కావడంతో చిరంజీవి తన తమ్ముడుకి అడ్డు వెళ్ళడం ఇష్టంలేక తన రూట్ మార్చుకుని తన మూవీ ‘ఆచార్య’ రిలీజ్ డేట్ ను క్రిస్మస్ వైపు యూటర్న్ తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈవార్తలే నిజం అయితే ‘ఆచార్య’ పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు అప్పుడే చర్చలు మొదలుపెట్టాయి. గతంలో లా కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ల మధ్య సాన్నిహిత్యం ఇప్పుడు బాగా పెరిగింది.


చిరంజీవి షష్టిపూర్తి కి మొక్కుబడిగా వచ్చిన పవన్ తన తీరు మార్చుకుని తరుచు తన ఇంటికి వెళ్ళడమే కాకుండా అవకాశం చిక్కినప్పుడల్లా తన అన్నను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ అన్నదమ్ముల ప్రేమ ఇప్పుడు అల్లు అర్జున్ కు సమస్యగా మారుతుందా అంటూ ఇండస్ట్రీలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ‘పుష్ప’ మూవీకి ఒక్క అమీర్ ఖాన్ మూవీతో తప్ప మరి ఏ మూవీతోను పోటీలేదు. ఇప్పుడు చిరంజీవిని జీవితాంతం అభిమానించే బన్నీకి ఇప్పుడు అతడే పోటీగా వస్తే ఈ సున్నితమైన సమస్యను బన్నీ ఎలా పరిష్కారం చూపుతాడో చూడాలి..    



మరింత సమాచారం తెలుసుకోండి: