ప్రస్తుతం యంగ్ హీరోలు తమ సినిమాల అనౌన్స్ మెంట్ల తో విడుదలతో ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం చేయలేని ప్రమోషనల్ థింగ్స్ ను చేస్తూ బజ్ ను క్రియేట్ చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం తమ సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను కూడా చెప్పటం లేదు. వారి చేతిలో సినిమాలు లేవు అంటే సంవత్సరాల క్రితమే మొదలైన సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయినా కూడా ఆ సినిమాలకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్ ను కూడా వారు మొదలు పెట్టడం లేదు.

అలాంటి వారిలో ముందుగా యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి చెప్పుకోవాలి. ఆయన హీరోగా 2018 లో చేసిన కిరాక్ పార్టీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత అర్జున్ సురవరం సినిమా రిలీజ్ అయినా కూడా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఈ లెక్కన మూడేళ్ల నుంచి ఈ హీరో హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. అలా ప్రస్తుతం సుకుమార్ నిర్మాణంలో 21 పేజెస్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మొదలై చాలా రోజులు అవుతున్నా దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు ఈ కుర్రహీరో.
అలాగే మరో యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన అప్ కమింగ్ సినిమా మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న విడుదల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. దాంతో అతని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని చిత్రబృందంను అడుగుతున్నారు. ఇక దగ్గుబాటి రానా భీమ్లా నాయక్ సినిమా మీద పెడుతున్న దృష్టి సోలో హీరోగా ఆయన చేస్తున్న విరాట పర్వం మీద పెట్టడం లేదు అన్నది అభిమానుల ప్రశ్న. అలా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ విడుదల చేయకపోవడం వారికీ ఎంతగానో నిరాశ కలిగిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి