'బడిపంతులు' సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కు మనవరాలు పాత్ర చేసింది అందాల తార శ్రీదేవి. కానీ కొంతకాలం తర్వాత రాఘవేంద్రరావు తెరకెక్కించిన వేటగాడు సినిమాతో ఎన్టీఆర్ కు హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే 'జస్టిస్ చౌదరి' 'బొబ్బిలి సింహం' వంటి సినిమాల్లో శ్రీదేవి ఎన్టీఆర్ కు జోడీగా నటించి మెప్పించింది. సరిగ్గా ఇలాంటి అద్భుత సంఘటనే మన యాంగ్రీ స్టార్ అయిన రాజశేఖర్ విషయంలో కూడా జరిగిందట. అస్సలు విషయంలోకి వెళితే.
1989వ సంవత్సరంలో రాజశేఖర్ హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 'మమతల కోవెల' అనే సినిమా వచ్చిందట. ఆ సినిమాలో రాజశేఖర్ కు జోడీగా సుహాసిని నటించిందట. అలాగే ఆ సినిమాలో రాజశేఖర్ కూతురి పాత్రలో అందాల తార రాశి(చైల్డ్ ఆర్టిస్ట్) గా నటించి మెప్పించిందట.అయితే 1999 వ సంవత్సరంలో రాజశేఖర్ హీరోగా ఇవివి సత్యన్నారాయణ దర్శకత్వంలో వచ్చిన 'నేటి గాంధీ' సినిమాలో హీరోయిన్‌గా నటించి ఔరా అనిపించిందట హీరోయిన్ రాశీ.ఆ మూవీలో రాజశేఖర్ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రని పోషించాదట. అలాగే హీరోయిన్ రాశి.. విలన్ మరియు వారి గ్యాంగ్ వల్ల అత్యాచారానికి గురయ్యి ప్రాణాలు పోగొట్టుకునే అమ్మాయిగా నటించి అందరిని కంటతడి పెట్టిస్తుందట. సెంటిమెంట్ మరీ అంత ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాని అంతగా మెచ్చుకోలేదని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి