టాలీవుడ్ లో ఎప్పటికీ మన్మధుడిగా పేరు పొందారు మన అక్కినేని నాగార్జున. ఈ రోజు ఆయన తన 62 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఆనాటి ఏ ఎన్ ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు ల తర్వాత అగ్ర హీరోలుగా గుర్తింపు పొందిన వారిలో నాగార్జున ఒక్కరు. ఇతను స్వతహాగా ఒక ఇంజనీర్ అయినప్పటికీ నటనపై ఉన్న మక్కువతో సినిమాల వైపు అడుగులు వేశారు. అంతకు ముందు 1960 మరియు 1970 సంవత్సరాల మధ్య నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరావు మంచి హీరోగా వెలుగొందారు. నాగార్జున మొదటి సినిమా విక్రమ్.. ఇది 1986 వ సంవత్సరంలో విడుదలయింది. ఇది ఒక హిందీ మూవీకి రీమేక్ కావడం విశేషం. ఆ తర్వాత పలు సినిమాలను చేసి మంచి హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

నాగార్జున కెరీర్ 1986 లో మొదలైనప్పటికీ, నాగార్జున పేరును మరియు స్థాయిని తెలుగు ప్రేక్షకుల మనసులో ఇనుమడింప చేసిన సినిమా రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన శివ చిత్రం అని చెప్పాలి. ఇది ౧౯౯౦ లో విడుదలై సంచలన విరాజయాన్ని నమోదు చేసింది. నాగార్జున కెరీర్ శివకు ముందు శివ తరువాత అని చెప్పుకునేలా భారీ మాస్ హిట్ ను సొంతం చేసుకున్నాడు నాగార్జున. ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా తోనే నాగార్జునకు మరో జీవితం మొదలవడానికి కారణమయింది. శివ సినిమాలో తనతో నటించిన అమలనే రెండవ పెళ్ళి చేసుకున్నారు. ఈ పెళ్లికి ముందే నాగార్జునకు తన మొదటి భార్య లక్ష్మి కి నాగచైతన్య జన్మించి ఉన్నాడు.  కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది.

ఈ విషయంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చినా ఏవీ నాగార్జున కెరీర్ స్పీడ్ ముందు నిలవలేకపోయాయి. ప్రస్తుతం నాగార్జున అమల ఇద్దరూ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు... వీరిద్దరికీ అఖిల్ కొడుకు. నాగార్జున ఒక తండ్రిగా ఒక హీరోగా నిర్మాణ సంస్థకు యజమానిగా అన్ని బాధ్యతలను ఒంటిచేత్తో నిర్వర్తిస్తూ ముందుకు సాగిపోతున్నారు.
 ఒక రకంగా నాగార్జున రెండవ పెళ్లి చేసుకోడంలో రామ్ గోపాల్ వర్మ పాత్ర ఉందని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది వారిద్దరికే తెలియాలి. తాను పరిచయం చేసిన హీరోయిన్ అమలను పెళ్లి చేసుకోవడంతో రామ్ గోపాల్ వర్మ తో మంచి బాండింగ్ ఉన్నట్లు చాలా ఇంటర్వ్యూలలో నాగార్జున చెబుతూ ఉంటారు. రామ్ గోపాల్ వర్మ  నాగార్జున రెండవ పెళ్లి చేసుకోవడానికి కారణమయ్యాడని తెలుగు ప్రేక్షకులు చెప్పుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: