పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  సాగర్ చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ రచయితగా చేస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రానా కూడా మరో కథనాయకుడు. ఇక ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా సగానికి పైగా జరుపుకుంది. ఇక హరీష్ శంకర్ సినిమా ఎలాగో  ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన అన్ని సినిమాలకు సంబంధించిన అప్డేట్ లు వెలువడగా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన విడుదల తేదీని కూడా చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 29న విడుదలవుతున్నట్లు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపింది  చిత్రబృందం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సినిమాలేవీ థియేటర్లోకి వచ్చే సాహసం చేయడం లేదు. దీంతో నిర్మాతల మధ్య గ్యాప్ తగ్గిపోయింది. రిలీజ్ డేట్ సమస్య ఎదురవుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేయడం వల్ల సినిమాపై క్రేజ్ తగ్గే  అవకాశం ఉందని భావిస్తున్నారు పవన్ అభిమానులు. ఎందుకంటే పవన్ నటించిన భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాని అతి తక్కువ సమయంలో విడుదల చేయడమే కాకుండా ఆ విడుదల తేదీని కూడా ప్రకటించడం పవన్ అభిమానులకు కొంత నచ్చడం లేదు. అయితే ఏ విధమైన ఆలోచన తో చిత్ర యూనిట్ ఇలా చేసిందో తెలియదు కానీ ఆ సినిమా విడుదల అయ్యే అంతవరకూ ఇది  ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. సోషల్ మీడియాలో దీనిపై సెటైర్లు పడుతున్నాయి. రిలీజ్ పోస్ట్ ఫోన్ చేయాలంటే ఏదో ఒక డేట్ చెప్పాలి కాబట్టి యూనిట్  ఈ  విడుదల తేదీని ప్రకటించింది అంటూ జోకులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: