టాలీవుడ్ హీరో మహేష్ బాబు తో సినిమా చేసే ఛాన్స్ కోసం ఎందరో దర్శకనిర్మాతలు అలానే హీరోయిన్స్ ఆశగా ఎదురు చూస్తుంటారు. చూడడానికి హాలీవుడ్ హీరోలా ఉండే సూపర్ స్టార్ మహేష్ కి అదే రేంజ్ లో ప్రేక్షకాభిమానుల్లో క్రేజ్, ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇక ఇటీవల కొన్నాళ్లుగా వరుసగా సక్సెస్ లు మీద సక్సెస్ లు అందుకుంటూ కొనసాగుతున్న సూపర్ స్టార్, ప్రస్తుతం చేస్తున్న సినిమా సర్కారు వారి పాట.

మహేష్ బాబు కి జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుండగా పరశురామ్ పెట్ల దీనిని తెరకెక్కిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని విలన్ గా యాక్ట్ చేస్తున్నట్లు టాక్. కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్ తో పాటు టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇటీవల మొత్తం మూడు షెడ్యూల్స్ జరుపుకున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుండగా, నేడు అక్కడి ఫెమస్ ట్రైడెంట్ హోటల్ లో కీలక సన్నివేశాలు తీస్తున్నారట. అలానే ఆ హోటల్ ఒక భారీ ఫైట్ కూడా ప్లాన్ చేసారని, దీనిని రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా తీస్తున్నారని అంటున్నారు.

ఇప్పటికే మహేష్ బాబు అభిమానులు తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ సర్కారు వారి పాట మూవీపై ఎంతో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం పలు బ్యాంకులను కుదిపేసిన ఆర్ధిక నేరాలని బేస్ చేసుకుని దర్శకడు పరశురామ్ ఈ సినిమాని తీస్తున్నట్లు టాక్. మొత్తంగా ఈ సినిమా రేపు విడుదల తరువాత అందరినీ ఎంతో ఆకట్టుకుని సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా, సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: