రామ్ చరణ్ శంకర్ ల కాంబినేషన్ లో మొదలైన భారీ మూవీ ప్రారంభోత్సవానికి చిరంజీవితో పాటు రణవీర్ సింగ్ హాజరు కావడం అనేక చర్చలకు తావు ఇస్తోంది. ఈమూవీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక కీలకమైన పాత్ర ఉంటుందట. ఈపాత్రను ఒక క్రేజీ హీరోతో నటింపచేయాలని శంకర్ ఆలోచన అని అంటున్నారు.


తెలుగు తమిళ హిందీ భాషలలో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీకి సంబంధించి ప్రతి భాషకు సంబంధించిన వెర్షన్ లోను ఆ భాషకు సంబంధించిన క్రేజీ హీరోతో నటింప చేయాలని శంకర్ ఆలోచన అని టాక్. ఈ మూవీ బాలీవుడ్ వెర్షన్ లో చరణ్ తో రణవీర్ వీర్ సింగ్ నటిస్తే తమిళ వెర్షన్ లో చరణ్ తో విక్రమ్ నటిస్తాడు అని అంటారు. ఇక ఈ మూవీ తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి ఆ ప్రత్యేక పాత్రను చిరంజీవితో కాని పవన్ తో కాని చేయించాలని  శంకర్ ఆలోచన అంటున్నారు.


‘వకీల్ సాబ్’ విడుదల చేసిన తరువాత నిర్మాత దిల్ రాజ్ కు మరో మూవీ చేసి పెడతాను అని పవన్ మాట ఇచ్చాడు అని అంటారు. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని పవన్ కు గుర్తు చేసి అతడితో ఈమూవీలో నటింపచేయాలని దిల్ రాజ్ ప్లాన్ అన్న మాటలు కూడ ఉన్నాయి అయితే శంకర్ ప్లాన్ మాత్రం వేరుగా ఉంది అంటున్నారు. ఎప్పటి నుంచో శంకర్ కు చిరంజీవితో ఒక మూవీ చేయాలని కోరిక.


ఆ కోరికను ఈ మూవీ ద్వారా  తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ మూవీలోని ప్రత్యేక పాత్రను చిరంజీవితో నటింప చేసే ఆలోచనలలో శంకర్ ఉన్నాడు అనే వార్తలు కూడ వస్తున్నాయి. దీనితో ఈ మూవీకి సంబంధించిన ప్రత్యేక పాత్రలో చిరంజీవి పవన్ లలో ఎవరో ఒకరు నటించడం ఖాయం అన్నవార్తల హడావిడి మొదలు కావడంతో చిరంజీవి పవన్ అభిమానులు మాత్రం ఈ మూవీలో ఎవరు నటిస్థారు అంటూ ఇప్పటినుంచే టెన్షన్ పడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: