డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గాయకుడిగా సింగర్ మనో గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సింగర్ గా మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో జడ్జిగా, సినిమాల్లో నటుడిగా కూడా ఆయన చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరగా ఉన్నాడు. గతంలో పలు సంగీత కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరించగా ఇప్పుడు ఆయన హాస్యభరితమైన కార్యక్రమానికి జడ్జిగా చేస్తున్నాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఈయనకు రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉంది. ఏ హీరోకైనా ఆయన డబ్బింగ్ చెబితే చక్కగా కుదురుతుంది అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది.

ముఖ్యంగా రజనీకాంత్ కు ఆయన డబ్బింగ్ చెబితే సాక్షాత్తు ఆయనే వచ్చి డబ్బింగ్ చెప్పినట్లుగా ఉంటుంది అని అంటూ ఉంటారు. తమిళంతో పాటు తెలుగు లో కూడా ఒకేసారి విడుదల అయ్యే రజినీకాంత్ సినిమా లో ఆయన డైలాగ్ డెలివరీ కి, స్టైల్ కి ఏ మాత్రం తగ్గకుండా అదే ఎనర్జీ తో డబ్బింగ్ చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు మనో. అలా రజినీకాంత్ కు ముందు సాయి కుమార్ డబ్బింగ్ చెప్పగా  భాషా చిత్రానికి సాయి కుమార్ అదిరిపోయే విధంగా డబ్బింగ్ చెప్పాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

తెలుగులో ఆ సినిమాలోని డైలాగులు కూడా హిట్ అయ్యాయి. అలాగే పెదరాయుడు సినిమాలో కూడా రజినీకాంత్ కి డబ్బింగ్ చెప్పాడు సాయి కుమార్. అయితే కె.ఎస్.రవికుమార్ డైరెక్ట్ చేసిన ముత్తు సినిమాలో సాయి కుమార్ ను సంప్రదించగా అప్పటికి ఆయన హీరోగా బిజీగా ఉండడంతో డబ్బింగ్ చెప్పడానికి టైం కుదరలేదు. దాంతో ముసలి రజినీకాంత్ పాత్ర కి తొలి సారి డబ్బింగ్ చెప్పారు మనో. అదే టైంలో సాయికుమార్ బిజీగా ఉండడంతో యంగ్ రజినీకాంత్ పాత్రకి కూడా మీరే చెప్పాలి అని మనో కి చెప్పడం ఆయన ఒప్పుకోవడం జరిగింది. అలా అప్పటి నుంచి సాయి కుమార్ కి బదులు మనో డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: