అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో మీనా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో వరుసగా విజయాలు అందుకుంది. కానీ ఇక మీనా తన కెరీర్లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసి పెద్ద తప్పు చేశాను అని ఎన్నోసార్లు బాధ పడ్డారట. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన నరసింహ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించిన రమ్యకృష్ణ కు దక్షిణాదిలో ఊహించినంత పేరు వచ్చింది. అయితే ఈ సినిమాలో మొదట రమ్యకృష్ణ కు బదులుగా మీనా ను చిత్ర దర్శకుడు సంప్రదించారట.
అయితే దర్శకుడు ఇక నరసింహ సినిమాలోని నీలాంబరి పాత్రను మీనాకు వివరించగా ఆ పాత్ర కూడా మీనాకు తెగ నచ్చేసిందట. కానీ అప్పుడప్పుడే వరుస విజయాలను అందుకుంటున్న మీనా అంతలోనే నెగిటివ్ రోల్ చేస్తే ఆమెకు మార్కెట్ తగ్గిపోతుంది అని భావించి ఇక మీనా తల్లి నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలో తమ కూతురు నటించదు అంటూ దర్శకుడికి చెప్పేసిందట. అయితే అటు రజనీకాంత్ కూడా మీనా తో నటించడానికి ఆసక్తి చూపినప్పటికీ మీనా మాత్రం నీలాంబరి పాత్ర మిస్ చేసుకుందట. ఇక ఆ తర్వాత ఈ సినిమా హిట్ అవ్వడం పాత్ర బాగా హైలెట్ అవ్వడంతో.. ఇక ప్రతి ఫంక్షన్ లో కూడా నీలాంబరి పాత్ర గురించి గొప్పగా మాట్లాడుతూ ఉండడంతో ఎంతో బాధపడిందట మీనా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి