ఒకప్పుడు సినిమా సెలెబ్రిటీ అయినా, లేదా రాజకీయ నాయకుడిని అయినా ఒక సామాన్యుడు చూడాలి అంటే డైరెక్ట్ గా వెళ్ళాలి లేదంటే వాళ్ళైనా మన దగ్గరకు రావాలి. వాళ్ళు ఎలాగు రారు అని తెలుసు. మనము వెళ్లలేము. అలాంటప్పుడు కేవలం టీవీలలో సినిమాలో చూసుకుంటూ తృప్తి పడేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా సెకన్ల వ్యవధిలో మనము తెలుసుకోగలుగుతునాడు. దీనికి కారణం  రెండే రెండు...ఒకటి మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ మరియు ఆ ఫోన్ లో ఉండే సోషల్ మీడియా యాప్స్. ఇవి లేకుండా కొంతమంది అసలు జీవించలేరు అనేది చాలా మంది జీర్ణించుకోలేని విషయం. ఇప్పుడు ప్రపంచమంతా సోషల్ మీడియాలోనే బ్రతుకుతోంది. అయితే సోషల్ మీడియా ద్వారా చాలా మంచి జరుగుతోంది. అలాగే కొన్ని దురాగతాలు జరుగుతున్నాయి.

అయితే సోషల్ మీడియా ద్వారా ప్రజలకు దగ్గరగా ఉంటూ మంచి చేస్తున్న సెలెబ్రిటీలు చాలా తక్కువే అని చెప్పాలి. అటువంటి వారిలో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ ఒకరు. ముఖ్యంగా నిఖిల్ తన ట్విట్టర్ అకౌంట్ @actor_Nikhil ద్వారా అభిమానులకు ఎప్పటికప్పుడు తమ సినిమా విశేషాలను తెలియచేస్తూ టచ్ లోనే ఉంటారు. ముఖ్యంగా కరోనా సమయంలో నిఖిల్ చేసిన సేవలు అభినందనీయం. కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలా అమ్దన్హికి మెడిసిన్ దొరక్క ఇబ్బంది పడుతుంటే తన ట్విట్టర్ ద్వారా అడిగిన కొందరికి తన సొంత డబ్బుతో మెడిసిన్ అందించి వారి ప్రాణాలను నిలబెట్టారు.

ఇంకోసారి లాక్ డౌన్ సమయంలో పేషెంట్ దగ్గరకు తనే స్వయంగా వెళ్లి  మెడిసిన్ ఇచ్చిన సందర్భం మనము చూశాము. ఆ సమయంలో పోలీసులు తన వెహికల్ ను వెళ్లకుండా ఆపారు. అక్కడ కొంచెం ఇబ్బంది జరిగిన పోలీస్ కమిషనర్ చొరవతో సదరు పేషెంట్ కు మెడిసిన్ అందించారు. ఇలా మనకు తెలిసి చేసిన పనులు తెలియకుండా ఎన్నో సేవలు చేసి అటు ప్రజల మనస్సులో ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టిలో ఒక మంచి మనిషిగా గుర్తింపబడ్డారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆ టైం లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నిఖిల్ ను ఆఫీసుకు పిలిచి శాలువాతో గౌరవించారు.  వీరిని చూసి చాలా మంది స్ఫూర్తిగా తీసుకుని సహాయం చేసిన సంఘటనలు మనము చూశాము.



   

మరింత సమాచారం తెలుసుకోండి: