మహేష్ బాబు కి టాలీవుడ్ లో ఓ సంచలనం సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేశాడు ఈ హీరో. బాలనటుడిగా మెప్పించి బ్లాక్ బాస్టర్ హీరోగా దూసుకొచ్చాడు. రాజకుమారుడు, యువరాజు, మురారి, దూకుడు, అతడు వంటి రికార్డులు బద్దలు కొట్టిన చిత్రాలెన్నో. హిట్లు, ఫ్లాప్ లని తేడా లేకుండా రాకెట్ లా దూసుకొచ్చారు మహేష్ బాబు. ఓ సినిమా వస్తుంది అంటే.. ముఖ్యంగా హీరో, దర్శకుడు, హీరోయిన్ లను బట్టి ఆ చిత్రంపై అంచనాలు ఏర్పడతాయి. సహజంగా స్టార్ హీరో చిత్రం అంటే అంచనాలు బాగానే ఉంటాయి. అందులోనూ వరుస హిట్లు అందుకుంటున్న నేపథ్యంలో వారి సినిమాపై భారీ అంచనాలు నెలకొంటాయి. కానీ కొన్ని సార్లు ఎంత స్టార్ హీరో చిత్రమైనా కంటెంట్ లేకపోయినా, టేకింగ్ బాగోలేకపోయినా సినిమా పెట్టుకున్న అంచనాలు తారుమారు అవుతాయి.

కొన్ని సార్లు కథ బాగానే ఉన్నా హీరో, డైరెక్టర్ స్థాయికి తగ్గ  సినిమా కాదని అంటుంటారు. అలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన మహేష్ బాబు మూవీ "1 నేనొక్కడినే". దర్శకుడు సుకుమార్ ఎన్నో ఆశలతో తెరకెక్కించిన మూవీ  నేనొక్కడినే. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేయగా బాలీవుడ్ బామ కృతి సనన్ హీరోయిన్ గా చేశారు. ఓ వైపు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కావడం మరో వైపు అగ్ర హీరో మహేష్ బాబు అందులోనూ దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్ హిట్ల జోరు ఉండటంతో ఆ గాలి కాస్త ఈ సినిమాపై బాగానే వీచింది. అందులోనూ భారీ బడ్జెట్ మూవీ. దాంతో నేనొక్కడినే సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ మూవీలో మహేష్ రాక్ స్టార్ లా కనిపించబోతున్నాడు అని తెలియడంతో ఆడియన్స్ ఇక ఈ సినిమా రాకింగ్ అంటూ ఫిక్స్ అయిపోయారు.

హిందీ బామ హీరోయిన్ అనడంతో హైప్ మరింత పెరిగింది. ఇలా ఎన్నో అంచనాల నడుమ 10 జనవరి 2014 లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద చతికిలపడింది. మహేష్ కెరీర్ లో పెద్ద డిజాస్టర్ గా మారింది. 73 కోట్ల బడ్జెట్ తో రూపు దిద్దుకున్న ఈ సినిమా తిరిగి కనీసం 40 కోట్లను కూడా వసూలు చేయలేకపోయింది. మహేష్ వంటి బిగ్ స్టార్ హీరోల చిత్రాలంటే ఆడియన్స్ కి  ఖచ్చితంగా కొన్ని ఎక్స్పెక్ట్ చేసే అంశాలు  ఉంటాయి. కానీ వాటిని రీచ్ అవడంలో సుకుమార్ ఫెయిల్ అయ్యాడు.  ఫస్టాఫ్ ని పక్కా ప్లానింగ్ తో ఎంతో పగడ్బందీగా నడిపిన డైరెక్టర్ సుకుమార్ సెకండాఫ్ ని అదే ఫేజ్ లో రన్ చేయలేకపోయారనే వార్తలు చాలానే వినిపించాయి. కానీ మహేష్ మాత్రం తన పాత్రకు  న్యాయం చేశారు.

ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టే మహేష్ ఈ చిత్రంలో ఫుల్ హ్యాండ్సమ్ గా స్టైలిష్ గా కనిపించారు. హీరోయిన్ పాత్ర పరిమితంగానే కనిపించింది. మ్యూజికల్ గా పర్వాలేదనిపించింది. దర్శకుడు కథను థ్రిల్లింగ్ గా చూపించాలనే ప్రయత్నంలో  కన్ఫ్యూజన్ ఎక్కువయ్యింది అన్న విమర్శలు వినిపించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి కథ కొత్త హీరోలకు అయితే చూడగలం. కానీ ప్రిన్స్ లాంటి స్టార్ డం ఉన్న హీరోలను మాత్రం ఊహించుకొలేకపోయారు. ఈ సినిమా ఇచ్చిన ఫలితంతో డైరెక్టర్ మరియు హీరోలకు చుక్కలు కనబడ్డాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: