తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కమెడియన్లు తమదైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఇప్పటివరకు గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందారు. అలా ఎమ్మెస్ నారాయణ అలియాస్ మైలవరపు సూర్యనారాయణ తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తూ కొనసాగుతూ వచ్చి ప్రేక్షకులను అలరించారు. దర్శకుడిగా రచయితగా కూడా చేసిన ఆయన 17 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో దాదాపు 700కు పైగా సినిమాలలో నటించాడు.

చదువుకునే రోజుల నుంచి ఆయనకు సినిమా పట్ల మంచి ఆసక్తి ఉండేది. తొలుత ఆయన రచనలు చేసి కొన్ని నాటకాలు కూడా రాసేవారు. ఆయన దర్శకుడు రవిరాజా పినిశెట్టి వద్ద కొన్ని రోజులు రచయితగా పనిచేశాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా నటించి తద్వారా గుర్తింపు సాధించుకున్నాడు. ఆయనకు మంచి గుర్తింపు తీసుకు వచ్చిన చిత్రం మా నాన్నకు పెళ్లి. అందులో ఒక తాగుబోతు పాత్రలో నటించగా ఆ తరువాత ఎక్కువగా అలాంటి పాత్రలే ఆయనకు వచ్చాయి.

దాంతో తాగుబోతు పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయాడు. 1995 లో వచ్చిన పెదరాయుడు చిత్రంలో తొలిసారిగా వెండితెరపై క్రేజ్ తెచ్చుకున్నారు. ఎం.ఎస్.నారాయణ. అంతకుముందే కొన్ని చిత్రాల్లో నటించినా కూడా ఆయనకు అవి అంత పెద్దగా పేరు తీసుకు రాలేకపోయాయి. కానీ ఈ సినిమా ఆయనను సినీ రంగంలో నిలబడడానికి ఎంతగానో ఉపయోగపడింది. కథా చర్చల్లో పాల్గొనేటప్పుడు రవిరాజా పినిశెట్టి ఆయనలో ఉన్న హావభావ ప్రదర్శనకు ముగ్ధుడై ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో అవకాశం కల్పించాడు. ఆ తర్వాత ఆయన చేసిన అన్ని సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. 

ఇప్పటి వరకూ తన నటజీవితంలో 5 నంది అవార్డులు అందుకున్నారు. అవన్నీ తాగుబోతు పాత్రలు రావడం విశేషం. ఇకపోతే దూకుడు చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అందుకున్నాడు. 200 చిత్రాలకుపైగా తాగుబోతు పాత్రలో నటించి ప్రేక్షకులను తనదైన రీతిలో అలరించాడు. ఆయన గ్లాస్ చేతిలో పట్టుకున్న ప్రతి పాత్రను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. అదేవిధంగా పేరడీ పాత్రలకు కూడా పెట్టింది పేరు. దూకుడు డిస్కో దుబాయ్ శీను తదితర చిత్రాల్లో వైవిధ్యం ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరించగలిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: