ఇక తన 39వ పుట్టినరోజు పార్టీలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తన ప్రేయసి అలియా భట్ తో కలిసి జోధ్ పూర్ అడవుల్లో షికార్ చేసేయడం కెమెరాల కంట పడింది. ఇక నగరానికి చెందిన ఛాయాచిత్రకారులు ఇన్ స్టాగ్రామ్ లో వీరికి సంబంధించిన ఈ ఫోటోని షేర్ చేయగా అది ఇప్పుడు చక్కర్లు కొడుతూ నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇక ఈ జంట విమానాశ్రయం నుండి బయటకు వెళ్తున్న ఫోటోలను పంచుకోవడం జరిగింది.ఇక ఈ ఫోటోలలో ఆలియా భట్ క్రాప్ టాప్ తో ఒక జత జీన్స్ ధరించడం జరిగింది. అలాగే ఆమె ఆకుపచ్చ ఇంకా తెలుపు జాకెట్ ని ధరించి  సన్ గ్లాసెస్ పెట్టుకొని ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. ఇక రణ్ బీర్ కపూర్ మాత్రం మొత్తం బుర్గుండి దుస్తులను ధరించడం జరిగింది.ఇక సెప్టెంబర్ 28 వ తేదీ మంగళవారం రోజు నాటికి రణబీర్ కపూర్ ఒక సంవత్సరం పెద్దవాడవడం జరుగుతుంది. గత ఏడాది అతను తన పుట్టినరోజును తన తల్లి నీతూ కపూర్ ఇంకా అలాగే తన సోదరి రిద్ధిమా కపూర్ సాహ్ని అలాగే తన లవర్ ఆలియాతో గడిపడం జరిగింది. ఇక అతను నీతూ ఇంకా రిద్ధిమాతో కలిసి భోజనం చేస్తున్న ఫోటోని ఆలియా పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ రెండు పుట్టినరోజు కేక్ లతో పోజులిచ్చాడు రణబీర్ కపూర్.

ఇక గత ఏడాది కరోనా మహమ్మారి లేకపోతే తాను ఇంకా ఆలియా భట్ వివాహం చేసుకునేవాళ్లమని రణబీర్ కపూర్ వెల్లడించడం జరిగింది. ఇక అలాగే మాజీ జర్నలిస్ట్ అయినా రాజీవ్ మసంద్ తో రణ్బీర్ కపూర్ మాట్లాడుతూ.. “ కరోనా మహమ్మారి మన జీవితాలను తాకకపోతే ఈపాటికే మా పెళ్లి అవ్వడం జరిగేది.కానీ నేను ఏదో ఒక విషయం చెప్పడం ద్వారా ఎలాంటి హడావుడి అనేది చేయను. ఇక నా జీవితంలో త్వరలో ఆ లక్ష్యాన్ని నేను గుర్తించాలనుకుంటున్నాను`` అని రణ్ బీర్ కపూర్ అన్నారు.అలియా భట్ - రణబీర్ కపూర్ గత మూడు సంవత్సరాల నుంచి డేటింగ్ చేస్తున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాలో కనిపించనున్న వీరిద్దరూ కూడా తరచూ ఎక్కువగా ఒకరి కుటుంబాలతో ఒకరు గడపడం అనేది కనిపిస్తుంది. ఇక ఇటీవల రణబీర్ కపూర్ అలియా తండ్రి ప్రముఖ బాలీవుడ్ చిత్రనిర్మాత అయినా మహేష్ భట్ పుట్టినరోజును జరుపుకోవడానికి అలియా భట్ తో కలవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: